చిరంజీవి 150వ సినిమా ప్రరంభోత్సవానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే ఆసినిమా ప్రారంభం ముందే మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న కొద్ది చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్నది 150వ చిత్రం కాదంటూ అది 151వ చిత్రం అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. 

 ‘బ్రూస్ లీ’ చిత్రంలో చిరంజీవి కనిపించాడు కాబట్టి అది 150వ చిత్రం అయ్యిందని ఇప్పుడు చేసేది 151వ చిత్రం అంటూ చిరంజీవి లెక్కలు మర్చిపోయారంటూ వెబ్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు చిరంజీవి తన కెరియర్ లో ఇప్పడి వరకు చేసిన ఏడు ఎనిమిది అతిథి పాత్రల సినిమాలు లెక్క వేసుకుంటే చిరంజీవి నటించిన 150వ సినిమా పదేళ్ళ క్రితమే చేసినట్లు అవుతుందని కొత్త లెక్కలు మొదలు పెట్టారు.  

ఈ ప్రచారానికి మెగా ఫ్యాన్స్ ఓ రేంజిలో రియాక్ట్ అవుతున్నారు. ఫ్యాన్స్ కు, యాంటి ఫ్యాన్స్ కు మధ్య యుద్దం వెబ్ మీడియాలో జోరుగా జరుగుతోంది.  దీనితో రెచ్చి పోయిన మెగా ఫ్యాన్స్ ఏనుగు వెళ్తూంటే కుక్కలు మొరుగుతాయి ఏనుగు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా చిరంజీవి 150వ సినిమా ప్రారంభోత్సవం కేవలం ప్రయివేటు ఫ్యామిలీ ఫంక్షన్ లా నిర్వహించడం మెగా అభిమానులకు ఏ మాత్రం రుచించడం లేదు అని టాక్. 

అయితే చిరంజీవి మాత్రం ఎటువంటి హడావిడి తన 150వ  సినిమా ప్రారంభ విషయంలో ఇష్టపడటం లేదు అని అంటున్నారు.  29న మెగాస్టార్ 150వ సినిమా ఓపెనింగ్ కార్యక్రమం చిరంజీవి మొట్టమొదట హైదరాబాద్ కు వచ్చినప్పుడు కొంత కాలం నివసించిన ఆనాటి అద్దె ఇల్లులో ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించడం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది అని అంటున్నారు. ఏమైనా చిరంజీవి 150వ సినిమా లెక్కలు మాత్రం అందర్నీ గందర గోళంలో పడేస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: