సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బ్రహ్మోత్సవం’ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ మోషన్ పోస్టర్ ద్వారా ఈ సినిమా ఎంత డిఫరెంట్ గా ఉండబోతోందో  అన్న సంకేతాలను మహేష్  ఇచ్చాడు. 

మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఈ మోషన్ పోస్టర్ ని లాంఛ్ చేశాడు. ఒక బ్రిడ్జ్ దూరంగా కనిపిస్తున్న ఊరు ఆ బ్రిడ్జ్ పై నుంచి బైక్ పై వస్తున్న  మహేష్ బాబును చూపెడుతూ ఈ మోషన్ పోస్టర్ ను డిజైన్ చేసారు.   ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేష్ సైకిల్ ఎంత డిఫరెంట్ గా కనిపించిందో ఈ సినిమాలో మహేష్ మోటార్ సైకిల్ కూడ అంతే డిఫరెంట్ గా కనిపిస్తోంది. 

ఈ మోటార్ బైక్ కు ఏకంగా మూడు టైర్లు పెట్టి బాగా పొడుగ్గా తయారు చేశారు. బైక్ పై మహేష్ వెనకాల ముగ్గురు హీరోయిన్లను కూడా ఎక్కించుకునేంత పెద్దగా బైక్ ని డిజైన్ చేసారా అని అనిపిస్తోంది. బ్లూకలర్ షర్ట్ జీన్స్ ప్యాంట్ తో కళ్లజోడు పెట్టుకుని మహేష్ చాలా అందంగా కనిపిస్తూ నిజమైన ప్రిన్స్ లాగే కనిపిస్తున్నాడు. 

చివర్లో మే 7న ఆడియో అంటూ చిన్న టెక్ట్స్ వేయడం చూస్తే ఈ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం వెనుక ఇప్పటివరకు ‘బ్రహ్మోత్సవం’ సినిమా పై వస్తున్నన గాసిప్పులకు క్లారిటీ ఇవ్వడానికే ఈ మోషన్ పోస్టర్ విడుదల చేసారు అని అనిపించడం సహజం. మాస్ సినిమాలు కన్నా డిఫరెంట్ స్టోరీలతో వస్తున్న సినిమాలకు ఆదరణ బాగా వస్తున్న నేపధ్యంలో ఈ ‘బ్రహ్మోత్సవం’ పై భారీ అంచనాలు ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: