చిరంజీవి పవన్ లు కలసి బాలకృష్ణను కార్నర్ చేస్తూ బిగ్ ఫైట్ కు రెడీ కాబోతున్నారా అనే వార్తలు వస్తున్నాయి. ఈ సారి రాబోయే సంక్రాంతి సీనియర్ హీరోల మధ్య బుల్ ఫైట్ లా మారే అవకాశం ఉంది అని అంటున్నారు. బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కి ఈ మధ్యనే  ముహూర్తం కూడ జరిగిపోయి రెగ్యులర్ షూట్ కు రెడీ అవుతూ బాలకృష్ణకు బాగా కలిసి వచ్చే సంక్రాతిని టార్గెట్ చేస్తూ విడుదల కావడానికి ప్రయత్నిస్తోంది. 

డైరెక్టర్ క్రిష్ ఎట్టి  పరిస్తుతులలోను ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి తన స్పీడ్ ను  పెంచడమే కాకుండా ఈ సినిమాలోని వార్ సీన్స్ లో వాడే ఆయుధాలకోసం ఇప్పటికే ఒక ఆయుధాల ఫ్యాక్టరీని రెడీచేస్తున్నాడు. ఇక బాలయ్య అయితే ఈసినిమా కోసం తన వెయిట్  తగ్గడానికి ప్రొటీన్ షేక్, సలాడ్స్ తీసుకుంటూ బిజీగా ఉంటున్నాడు. ఇక పవన్‌కల్యాణ్ విషయానికొస్తే ఎస్.జె. సూర్య డైరెక్షన్‌లో పవన్‌కల్యాణ్ మూవీ నిన్న  హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఈ సినిమాను కూడ సంక్రాతికి విడుదల చేసి తన ‘సర్దార్’ వల్ల వచ్చిన అప్రతిష్టను తోలిగించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.  
ఇక  ఇది చాలదు అన్నట్లుగా చిరంజీవి కుడా తన 150వ సినిమా ‘కత్తిలాంటోడు’ ను రేపు శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోపూజా కార్యక్రమాలు చేసి జూన్ నుంచి నిర్విరామంగా షూటింగ్ చేసి అన్ని కుదిరితే తాను కూడ సంక్రాతి రేస్ కు రెడీ కావలి అని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవి రీఎంట్రీని  గ్రాండ్ లెవెల్‌లో చూపించేలా సినిమాటోగ్రాఫర్  గా రత్నవేలుని భారీ పారితోషికం ఇచ్చి ఈసినిమాకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

2017 సంక్రాంతిని టార్గెట్ చేస్తున్న ఈ ముగ్గురు టాప్ హీరోలు తమ సినిమాలను ప్రారంభించినా ఈ ముగ్గురికీ ఇంకా ఏ హీరోయిన్ దొరక్కపోవడం మరో టిస్ట్. అయితే ఈ మూడు భారీ సినిమాలో బాలయ్య సినిమా మాత్రం ఖచ్చితంగా సంక్రాంతికి విడుదల అయ్యే నేపధ్యంలో బాలయ్యకు చెక్ పెట్టడానికి  చిరంజీవి ప్రయత్నిస్తాడా ? లేదంటే పవన్ ప్రయత్నిస్తాడా ? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..



మరింత సమాచారం తెలుసుకోండి: