మహేష్ బాబు ఫాన్స్ కి పొద్దు పొద్దున్నే సూపర్ న్యూస్ అన్న మాట. బ్రహ్మోత్సవం మోషన్ పోస్టర్ ని విడుదల చేసి ముందుగా చెప్పకుండానే ఇంటర్నెట్ లో - యూ ట్యూబ్ లో పెట్టేశారు నిర్మాతలు. కాశీ - వారణాసి లో రోడ్ ల మీద మహేష్ బైక్ తో వెళుతున్న పోస్టర్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా పాతికేళ్ళ కుర్రాడి లాగా ఉన్న మాహేశ్ బాబు ని చూసి ఫుల్ గా స్టున్ అవుతారు ఎవరైనా.



ఈ పోస్టర్ లో మహేష్ ఆహార్యం, బైక్ స్టైల్, పొడుగ్గా ఉన్న బైక్ వెనక భాగం ఆకట్టుకోగా బైక్ మీద గుజరాతీ లో ఎదో రాసి ఉండడం గమనార్హం. కాశీ లొకేషన్ లలో సినిమాని ఎక్కువ శాతం తీయడం తో ఇదంతా ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా అనిపించే సూచనలు కానపడుతున్నాయి. ఏదేమైనా ముందుగా చెప్పకుండా పెట్టిన ఈ మోషన్ పోస్టర్ జనాలు అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటోంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: