ప్రస్తుతం ఏ నోట విన్నా ఇప్పుడు బోయపాటి ముచ్చటే వినిపిస్తుంది.. సరైనోడు సినిమాతో బోయపాటి మరో రేంజ్ కు వెళ్లాడని చెప్పడంలో తప్పులేదు. అల్లు అర్జున్ కావాలనుకున్న మాస్ ఇమేజ్ ను సరిగ్గ స్క్రీన్ మీద పండించాడు దర్శకుడు. సినిమా ఫలితం ఎలా ఉన్నా బోయపాటి తన విషయంలో తాను పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. సినిమా చూసిన మెగాస్టార్ కూడా అదే అనుకున్నాడు కూడా. 


అయితే అల్లు అర్జున్ కెపాసిటీకి కాస్త ఎక్కువ హైప్ తెచ్చిన క్యారక్టర్ నే బోయపాటి అతని మీద పెట్టాడు. ఎప్పుడు స్టైలిష్ గా సినిమాలు తీసే బన్నిని మాస్ ఊర మాస్ అని బి,సి సెంటర్స్ లో అరుపులు పెట్టించేలా చేశాడు. అయితే ఈ సినిమా చూసిన మెగాస్టార్, మెగా పవర్ స్టార్ బోయపాటితో సినిమా చేసేందుకు సిద్ధం అన్నట్టు తెలుస్తుంది. 


సరైనోడు సినిమా షూట్ లో బోయపాటి, బన్ని :


మాస్ ఇమేజ్ ఉన్న హీరోలను సరైన మాస్ సినిమా తీసే దర్శకుడు చేతిలో పెడితే ఇక ఆ సినిమా బాక్స్ బద్ధలవ్వాల్సిందే. అయితే బోయపాటి మార్క్ సినిమాలు కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతాయి. తమ అభిమాన నటుడు వీరరసం చూపిస్తుంటే విజిల్స్ వేయడానికి రెడీగా ఉంటారు అభిమానులు. అందుకే మెగా కాంపౌండ్ లోకి వచ్చిన బోయపాటిని ఎక్కడికి జారకుండా వెంటనే చిరుతోనో, చెర్రితోనో సినిమా ఓకే చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. 


అయితే ప్రస్తుతం బోయపాటి ఆల్రెడీ కమిట్ అయిన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను పూర్తి చేసి కాని మెగా హీరోల సినిమాల గురించి ఆలోచించే వీలుండదు. మరి సరైనోడుతో అల్లు అర్జున్ కు ఎంత లాభం చేకూరిందో తెలియదు కాని కచ్చితంగా బోయపాటి శ్రీను స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయ్యిందని చెపాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: