కోలీవుడ్లో వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న నయనతార ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతుంది. సినిమాల్లో వచ్చిన లాభాలతో ఏదో బిజినెస్ చేయకుండా సినిమానే నిర్మిస్తా అంటుంది నయన్. అన్నట్టుగానే తానో సినిమా నిర్మించేందుకు సిద్ధమైంది ఈ అమ్మడు. ఇతంకీ నయనతార నిర్మించే సినిమా ఏంటి.. ఆ సినిమా హీరో ఎవరు అంటే వివరాలు ఇలా ఉన్నాయి. 


తమిళ తంబీలను తన అంద చందాలతోనే కాదు అభినయంతో కూడా అలరిస్తూ ఆకట్టుకుంటున్న నయనతార ఇప్పుడు ఓ సినిమా కూడా నిర్మిస్తుండటం విశేషం. శివ కార్తికేయన్ హీరోగా విఘ్నేష్ శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను నయన్ నిర్మిస్తుంది. అయితే ఇందులో హీరోయిన్ నయనతారనే నటిస్తుంది.


వరుస విజయాలతో దూసుకెళ్తున్న నయన్ నిర్మాతగా మారడం స్టార్ హీరోలను కూడా ఆశ్చర్యంలో పడేసింది. ముఖ్యంగా ఓ పక్క సినిమాల్లో నటిస్తూ మరో పక్క చిన్న సినిమాలను నిర్మిస్తూ హిట్స్ కొడుతున్న ధనుష్ నయన్ నిర్మాత అవతారాన్ని ఊహించి ఉండడు. తమిళంతో పాటుగా తెలుగులో బాబు బంగారం సినిమాలో నటిస్తున్న నయనతార హీరోయిన్ గానే కాదు ప్రొడ్యూసర్ గా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.



మరింత సమాచారం తెలుసుకోండి: