మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఫుల్ ఫాంలో ఉంది. రీసెంట్ గా తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయిన ఊపిరి సినిమాతో హిట్ అందుకున్న తమన్నా ఓ పక్క బాలీవుడ్ ఆఫర్ తో ఎగిరిగంతులేస్తుంటే మరో పక్క తెలుగులో కూడా క్రేజీ ఆఫర్స్ ఆమె ముందు వాలుతున్నాయి. ఇప్పటికే తెలుగు తమిళ భాషల్లో ధర్మదురయ్ సినిమాలో నటిస్తున్న తమన్నా ఎనర్జిటిక్ స్టార్ సినిమాలో సెలెక్ట్ అయ్యింది. 


ఇప్పటికే బాలీవుడ్ హ్యాండ్సం హీరో రణ్ వీర్ సినిమాలో సెలెక్ట్ అయిన తమన్నా ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రాం, సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా ఓకే అయ్యింది. రీసెంట్ గా నేను శైలజా అంటూ హిట్ కొట్టిన రామ్ అదే ఉత్సాహంతో ఈ సినిమా స్టార్ట్ చేశాడు. అయితే సంతోష్ తో ఎలాగు కందిరీగ హిట్ కొట్టాడు కాబట్టి ఈ సినిమా కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా హిట్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్నాడు రామ్.


ఎదుకంటే ప్రేమంటలో రామ్, తమన్నా:


ఇక రామ్, తమన్నా ఎందుకంటే ప్రేమంట సినిమాలో కలిసి నటించినా ఆ సినిమా హిట్ అవ్వలేదు. పెయిర్ బాగున్నా సినిమా ఫ్లాప్ అయ్యే సరికి కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ మరోసారి వీరు జతకడుతున్నారు. 14 రీల్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాను రాం ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకరలు నిర్మిస్తున్నారు. 


మరి లక్కీ ప్రాజెక్ట్స్ తో భారీ క్రేజ్ సంపాదిస్తున్న తమన్నా సినిమాల ఫలితాలు ఎలా ఉండబోతాయో చూడాలి. ఓ పక్క తమిళ తెలుగు భాషల్లో నిర్మితమవుతున్న ధర్మదురయ్ లో లేడీ ఓరియెన్ టెడ్ సినిమాతో కూడా ప్రయత్నాలు చేస్తుంది తమన్నా. 



మరింత సమాచారం తెలుసుకోండి: