సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమా మే నెలలో రిలీజ్ అవబోతుంది. పివిపి బ్యానర్లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుందని ముందునుండి హడావిడి చేశారు. కాని ప్రస్తుతం తమిళ బ్రహ్మోత్సవం లేదంటూ వార్తలు వస్తున్నాయి. దానికి కారణం దర్శక నిర్మాతలు సినిమాను భారీ రేంజ్ డిమాండ్ చేస్తున్నారట.


మహేష్ బాబుకి ఉన్న మార్కెట్ ప్రకారం తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ రేంజ్ లో రిలీజ్ అవుతున్న బ్రహ్మోత్సవం ఓవర్సీస్ లో కూడా అదే రేంజ్లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక తమిళ వర్షన్ కు 6.5 కోట్లకు డిమాండ్ చేస్తుండగా సినిమా అక్కడ రిలీజ్ చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదని టాక్. అందుకే తెలుగు వర్షన్ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే కోలీవుడ్ డబ్ వర్షన్ రిలీజ్ చేస్తారట.


ఇదిలా ఉంటే సమంత చేసిన తేరి ప్రస్తుతం అక్కడ సంచలన విజయం దక్కించుకుంది. ఇక కాజల్ కు అక్కడ మంచి మారెక్ట్ ఉంది. సో బ్రహ్మోత్సవంలో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ ఇద్దరి ఇమేజ్ తో అక్కడ కూడా భారీగానే క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే మన తెలుగు సినిమాలు తమిళంలో మార్కెట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. 


సో ఆ లెక్కన చూసుకుంటే మార్కెట్ పెంచుకోవడం కోసం మహేష్ కోలీవుడ్ రిలీజ్ కూడా తప్పనిసరి చేయాల్సిందే అది ఓ రూపాయి తక్కువకే అయినా తర్వాత సినిమాలకు అది ఉపయోగ పడుతుంది. మరి ఈ విషయంపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే బ్రహ్మోత్సవం ఆడియో మే 7న సినిమాను మే 20న అలా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.



మరింత సమాచారం తెలుసుకోండి: