సూపర్ స్టార్ మహేష్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన సినిమా పోకిరి. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ అయ్యి అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. వైష్ణో అకాడెమీ, ఇందిరా ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈరోజుకి సరిగ్గా పదేళ్లవుతుంది.


ఓ విధంగా మహేష్ స్టామినా తెలియ చెప్పిన సినిమా పోకిరి అనే అనాలి. మహెష్ సినిమాలను చూసుకుంటే పోకిరికి ముందు పోకిరికి తర్వాత చాలా వ్యత్యాసం ఉంటుంది. అప్పటిదాకా స్టార్ గా ఉన్న మహేష్ ను సూపర్ స్టార్ గా చేసింది పోకిరి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేవదాసు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఇలియానా పోకిరితో స్టార్ రేంజ్ కు వెళ్లింది.


పోకిరిగా అల్లరి చిల్లరగా తిరుగుతూ చివరి నిమిషంలో అండర్ కవర్ కాప్ గా కేక పెట్టించిన మహేష్ తన యాక్టింగ్ టాలెంట్ ను ఆ సినిమాతో రెట్టింపు చేశాడని చెప్పాలి. పూరి మార్క్ డైలాగ్స్ తో కూడా సినిమాలో మహేష్ తో పలికించి దిమ్మతిరిగే హిట్ కొట్టించాడు. యాక్షన్, కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ అన్ని అంశాలు మేలవించి సినిమా ఓ ప్రభంజనం సృష్టించింది.


తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన పోకిరి సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భంగా పూరి సూపర్ స్టార్ మహేష్ తో మరోసారి జన గణ మన అనే సినిమాతో రాబోతున్నాడు. బిజినెస్ మ్యాన్ అంటూ రెండో సారి చేసిన ప్రయత్నం కూడా హిట్ కొట్టడంతో జన గణ మనకి భారీ క్రేజ్ వచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: