బాలీవుడ్ హాట్ గాళ్ టబు మరోసారి సౌత్ సినిమాల్లో మెరిసేందుకు సిద్ధమవుతుంది. దాదాపు 7,8 ఏళ్ల తర్వాత టబు మళ్లీ తెలుగు భాషలో నటించడం విశేషం. ఇంతకీ టబు నటించే సినిమా ఏదంటే స్వీటీ అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న భాగమతి సినిమాలో.. అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యు.వి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మితమవుతుంది.


పిల్ల జమిందార్ తో హిట్ కొట్టిన అశోక్ సుకుమారుడు సినిమాతో కాస్త వెనుకబడ్డాడు. అయితే భాగమతి కథతో అనుష్క దగ్గరకు వెళ్లిన అనుష్క కథ నచ్చినా డైరక్టర్ ట్రాక్ రికార్డ్ చూసి సినిమా చేయాలా వద్దా అని ఆలోచించింది. కాని ఎట్టకేలకు ప్రభాస్ సహాయంతో అనుష్క ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుంది. రీసెంట్ గా సినిమా కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది.


ప్రస్తుతం బాలీవుడ్ లో తల్లి పాత్రలు చేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్న టబు ఈ ఆఫర్ ఓకే చెప్పడం వెనుక చాలా పెద్ద రీజన్ ఉండి ఉంటుందని అంటున్నారు. వెండితెర మీద అందాలు చిందించిన హాట్ భాలిద్దరు ఒకే సినిమాలో నటించడం అభిమానులకు కూడా గొప్ప విశేషమే అని చెప్పాలి. మరి భాగమతి సినిమాలో టబు చేస్తున్న పాత్ర ఏంటి అది ఎలా ఉండబోతుంది అన్నది త్వరలో తెలుస్తుంది.


బాహుబలి-2, సింగం-3 ల షూటింగ్ పూర్తి చేసుకున్నాక అనుష్క భాగమతి సినిమాకే పూర్తి డేట్స్ ఇవ్వనుంది. మరి స్వీటీ అనుష్క చేస్తున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: