సూపర్ స్టార్ మహేష్ నుండి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ బ్రహ్మోత్సవం నుండి ఈరోజు రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న బ్రహ్మోత్సవంలో ఫ్యాన్స్ ను నిరాశ పరచే అంశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. అదేంటంటే సినిమాలో ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదట.


సూపర్ స్టార్ అంతటి హీరోతో సినిమాలో ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా సినిమాను బాలన్స్ చేయడం కష్టమే.. కాని దాన్ని చేసి చూపిస్తా అంటున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. పివిపి బ్యానర్ లో పరం వి పొటూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, కాజల్, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే సినిమాలో ఫైట్ లేకున్నా సినిమా మొత్తం కుటుంబ బంధాలతో మనసుకి హత్తుకునేలా ఉంటుందని తెలుస్తుంది.


ప్రస్తుతం ఉన్న యూత్ అంతా తప్పుడు దోవలో వెళ్తుండటంతో కుటుంబ బంధాలకు కరువు ఏర్పడింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాతో మరోసారి కుటుంబ నేపథ్యాన్ని తెరకెక్కిస్తున్నాడు. సినిమా కూడా కచ్చితంగా అందరి మనసులను దోచేస్తుంది అంటున్నారు.


మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మే 7న ఆడియో రిలీజ్ జరుపుకుంటుంది. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: