‘భలే భలే మగాడివోయ్’ సూపర్ సక్సస్ తరువాత నాని దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ‘జెంటిల్ మెన్’ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు బయటపడింది. ఈసినిమాలో హీరో పాత్ర చేస్తున్న నాని పెద్ద కన్ఫ్యూజింగ్ మాష్టర్ గా కనిపిస్తాడట. ఈసినిమాలోని నాని పాత్ర కొంత వరకు నెగిటివ్ టచ్ లో ఉంటుంది. అన్న ప్రచారం జరుగుతోంది. 

అయితే ఈవార్తలు విన్న వారు ఈ సినిమాను దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గతంలో వచ్చి సూపర్ హిట్ అయిన హీరో సూర్య ‘గజిని’ సినిమాను కొద్దిగా మార్పులు చేసి ఇలా ‘జెంటిల్ మేన్’ తీసుకు వస్తున్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మర్డర్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కుతోంది. నివేదా థామస్, సురభి ఇందులో నానికి జోడీగా నటిస్తున్నారు. 

ఎన్నో టైటిల్స్ అనుకున్న తర్వాత ‘జెంటిల్ మెన్’ టైటిల్  కు ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. ‘అష్టా చమ్మా’ తర్వాత నాని ఇంద్రగంటి కాంబినేషన్ లో వస్తున్న ఈ  సినిమా పై ఫిలింనగర్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఫ్లాపుల్లో ఉన్నా తనకు లైఫ్ యిచ్చిన దర్శకుడు ఇంద్రగంటికి కెరియర్ టర్నింగ్ ఇవ్వాలని ధైర్యంతో ఈసినిమాను చేస్తున్నాడు నాని. 

ఒక మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ తో నడిచే ఈ కథలో సస్పెన్స్ చాల ఎక్కువగా ఉంటుంది.  ఈసినిమా షూటింగ్ చాల భాగం కేరళలో జరిగింది. నాని కెరీర్ లో ఇదో డిఫెరెంట్ మూవీ అని అంటున్నారు. అయితే కథలో ఏ మాత్రం సూర్య మురగదాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘గజిని’ సినిమా పోలికలు ప్రేక్షకులకు కనిపించినా ఈ సినిమాకు అనుకోని షాక్ తగిలే ప్రమాదం ఉంది అని అంటున్నారు. మరి నాని సాహసం ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: