‘లౌక్యం’ సినిమా తరువాత తిరిగి క్రేజ్ లోకి వచ్చిన గోపీచంద్ ఆ క్రేజ్ ను ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయాడు. గత సంవత్సరం డిసెంబర్ లో వచ్చిన ‘సౌఖ్యం’ ఫ్లాప్ అవడంతో తిరిగి గోపీచంద్ కెరియర్ రివర్స్ గేర్ లోకి వెళ్ళిపోయింది.  

దీనితో గోపీచంద్ తో సినిమాలు తీద్దాము అనుకున్న దర్శక నిర్మాతలు గోపీచంద్ ను వదిలి మరో హీరోల వేటలో పడ్డారు. ఈ పరిస్థితులలో గోపీచంద్ నటిస్తున్న ‘ఆక్సిజన్'  మోషన్ పోస్టర్ ను నిన్న శృతి హాసన్ విడుదల చేసింది. అయితే ఈ మోషన్ పోస్టర్ చూసిన వారు మాత్రం ఇది తెలుగు సినిమానా లేదంటే హాలీవుడ్ సినిమా తెలుగు డబ్బింగ్ ను చూడబోతున్నామా అంటూ సెటైర్లు వేస్తున్నారు. 

దీనికి కారణం ఈ సినిమా మోషన్ పోస్టర్ ను  హాలీవుడ్ రెసిడెంట్ ఈవిల్ సినిమా తరహాలో హైదరాబాద్ అంతా కాలి తగలబడుతుంటే ఆ బ్యాక్ డ్రాప్ లో మన హీరో గోపిచంద్ ఒక కారు మీదకు దూకడం కారు  అద్దాలన్నీ మన ఫ్యాక్షన్ సినిమాలలో లా ముక్కలవ్వడం పక్కనే ఉన్న గూండాలు ఆ అదురుకు ఎగిరి పడటం చూస్తూ ఉంటే అసలు ఈ సినిమా ఏ జోనర్ కు చెందింది అనుకోవాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు.  

దర్శకుడు ఏ.ఎమ్.జ్యోతికృష్ణా దీనిని సోషియో ఫ్యాంటసీ సినిమాలా తీస్తున్నాడా లేదంటే సైన్స్ ఫిక్షన్ లో సీమ ఫ్యాక్షన్ సినిమా చూపించ బోతున్నాడా అంటూ   అసలు గోపీచంద్ ఈసినిమాను ఏమి చూసి ఒప్పుకున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. జూన్ చివరలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఫలితం పై గోపీచంద్ కెరియర్ ఆధారపడి ఉన్న నేపధ్యంలో గోపీచంద్ ఇటువంటి సాహసం ఎందుకు చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: