టాలీవుడ్ సీతమ్మ అంజలి అనుకోని షాక్ కు గురైంది అన్న వార్తలు వస్తున్నాయి. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు వారికి దగ్గరైన అంజలి ఆ తరువాత ఆ క్రేజ్ ను ఆమె నిలుపుకోలేకపోయింది. వ్యక్తిగత సమస్యలతో పాటు వరస ఫెయిల్యూర్స్ రావడంతో అంజలి కెరియర్ ప్రశ్నార్ధకంగా మారిన నేపధ్యంలో ‘గీతాంజలి’ హిట్ అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.

దీనితో టాప్ యంగ్ హీరోలతో సినిమాలు ఎలాగు రావడం లేదు కాబట్టి కనీసం టాప్ యంగ్ హీరోతో ఐటమ్  సాంగ్ చేసి అయినా క్రేజ్ లోకి రావాలని ‘సరైనోడు’ సినిమాలో అల్లుఅర్జున్ తో ఐటమ్ సాంగ్ చేసి గ్లామర్ ఎక్స్ పోజ్ చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈ పాటను చూసిన వారంతా బన్నీ డాన్స్ స్టెప్స్ ల గురించి మాట్లాడుకుంటున్నారు కాని ఎవరూ అంజలిని పెద్దగా పట్టించుకొకపోవడం ఆమెకు షాక్ ఇచ్చినట్లు టాక్.

సామాన్యంగా టాప్ హీరోయిన్స్ తమన్నా శ్రుతిహాసన్ లాంటి వాళ్ళు టాప్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ చేసినప్పుడు యూత్ అదేవిధంగా మాస్ ప్రేక్ధకులు ఆ ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అంజలి గురించి ‘సరైనోడు’ ను చూసిన యూత్ కానీ అదేవిధంగా మాస్ ప్రేక్షకులు కానీ పట్టించుకోకపోవడంతో ఆమె ప్రయత్నం వృధాగా మారింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ వార్తలు ఇలా ఉండగా నిన్నటితో ముగిసిన మొదటి వారంతో ‘సరైనోడు’ 40 కోట్ల పైగా కలక్షన్స్ ను సాధించింది అని వార్తలు వస్తున్నాయి. ఈ వారం కూడ ఏ సినిమా ‘సరైనోడు’ కి పోటీ ఇచ్చేది విడుదల కాకపోవడంతో ఈ వరం కూడ ‘సరైనోడు’ హవా కొనసాగి 60 కోట్ల క్లబ్ లో చేరే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇంత బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించి కూడ ఎవరి దృష్టిని ఆకర్షించక పోవడం అంజలి దురదృష్టం అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: