పవన్ కళ్యాణ్ కి ఉన్నంత స్పెషల్ బెహేవియర్ ఎవ్వరికీ ఉండదు అనడం అతిశయోక్తి కాదేమో. కానీ ఒక్కొక్క సారి ఇలా చెయ్యడం కరెక్ట్ కాదు అనిపించేలా ఉంటుంది పవన్ కళ్యాణ్ బెహేవియర్. పబ్లిక్ ఫంక్షన్ లకి రావడం పవన్ కళ్యాణ్ కి చిరాకు కానీ తన ఫంక్షన్ లకి ఎలాగో తప్పాడు. మిగిలిన అన్నటికీ అంటే మెగా ఫామిలీ లో అన్ని ప్రోగ్రామ్స్ కి మాగ్జిమం రాడు పవన్ కళ్యాణ్. మేము పిలిచినా వాడు రాడు అంటూ నాగబాబు పవన్ కళ్యాణ్ మీద ప్రజా ముఖంగా విరుచుకు పడ్డ సంగతి తెలిసిందే. తన సొంత ఇంటి ఫంక్షన్ లు ఎగ్గొట్టడం పవన్ చేస్తున్న అతిపెద్ద తప్పు అంటున్నారు విశ్లేషకులు.






మెగాస్టార్ 150 వ సినిమా..ఆ ఒక్క పాయింట్ చాలు.. అదెంత కీలకమైన అకేషన్ అన్నదానికి. పైగా ఇది తొలిసారి చిరు తనయుడు చరణ్ నిర్మాతగా మారతున్న సినిమా. కొణిదెల అనే బ్యానర్ లో తనూ కొణిదెల వాడే కాబట్టి కళ్యాణ్ ఒస్తే బాగుండేది నిన్నటి ఫంక్షన్ కి. ఫామిలీ మొత్తం కలిసినా పవన్ కళ్యాణ్ రాకపోవడం మెగా ఫాన్స్ కి కోపం తెప్పించే విషయం. తాను ఈ స్టేజీలో ఉండడానికి చిరంజీవి కారణం అని పదే పదే చెబుతూ ఉండే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఫంక్షన్ లకి కూడా రాకపోతే దేనికి ఒస్తాడు అంటున్నారు ఫాన్స్ కూడా. మరొక పక్క త్రివిక్రమ్ సినిమా అ ఆ ఆడియో కి మే 2 న పవన్ రావడం ఖరారు అయిపొయింది. అంటే ఆ లెక్కన చూసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ అన్నయ్య చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ అయ్యాడా? అని అడిగేవారూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: