పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేగవంతంగా మూవీలను రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. గతంలో జనసేన పార్టీ పెట్టిన తరువాత రాజకీయాల్లో ఫుల్ బిజిగా మారిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు రాజకీయాలను పూర్తిగా దూరం పెట్టి, సినిమాలపై పడ్డాడు. పార్టీకి ఫైనాన్షియల్ మనీ ఎంతో అవసరం కాబట్టి, తను కష్టపడి సినిమాల్లో నటించి, ఆ వచ్చిన డబ్బులను పార్టీ కార్యకలాపాలకు ఉపయోగించాలని అభిప్రాయపడుతున్నాడు.


ఇక రాబోయో జనరల్ ఎలక్షన్స్ లో జనసేన పార్టీ కచ్ఛితంగా పోటీ చేస్తుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇందుకోసం పార్టీకి ఎంతో మనీ అవసరం. పార్టీ ఫండ్ ఎంతొస్తుందనేది పక్కన పెడితే, తన కంటూ కొంత మనీ అవసరం కాబట్టి, ఇందుకు సినిమాల్లో నటించటమే ఉత్తమైన మార్గం అని భావించాడంట. అందుకే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యస్.జె.సూర్య మూవీలో నటిస్తున్నాడు.


దీని తరువాత మరో మూవీలోనూ నటించే అవకాశం ఉంది. దీని కారణంగా పవన్ కళ్యాణ్ కి దాదాపు 40 కోట్ల రూపాయల మేర మనీ జమ అయ్యే అవకాశం ఉంది. పార్టీ పూర్తి స్థాయిలో జనాల్లోకి తీసుకువెళ్ళే సమయానికి దాదాపు 60 నుండి 100 కోట్ల రూపాయల మనీని తన వద్ద అవసరాల కోసం ఉంచుకోవాలని భావిస్తున్నారంట.


సర్ధార్ గబ్బర్ సింగ్  మూవీ ద్వార పవన్ కళ్యాణ్ కి దాదాపు 30 కోట్ల మేర రెమ్యునరేషన్ ఇతర బిజినెస్ వ్యవహారాల ద్వార సమకూరాయని అంటున్నారు. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు వద్ద నుండి ఒక్క రూపాయి కూడ ప్యాకేజ్ ని పొందలేదని జనసేన పార్టీ ప్రతినిధుల వద్ద నుండి అందుతున్న సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: