మలయాళ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమం సినిమా ని తెలుగు లో తీస్తున్న నాగ చైతన్య ఈ సినిమా మీద మొదటి నుంచే చాలా అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకి ప్రమోషన్ గట్టిగ ఉండాలి అని ఫిక్స్ అయ్యారు అక్కినేని ఫామిలీ వారు. ఈ సినిమా లో కామ్యో రోల్ లో వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కి మరొక హై లైట్ గా నాగార్జున వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు అని అంటున్నారు. నాగార్జున - వెంకటేష్ లు ఇద్దరూ కలిసి ఈ సినిమా హైప్ ని అమాంతం పెంచేసే లా కనిపిస్తున్నారు.



దాంతో సినిమా మైలేజీ వేరుగా ఉంటుంది , ఉండి తీరుతుంది. ఆగస్ట్ లో సినిమా విడుదల కి సిద్దం అవుతూ ఉండగా గోవా లో టాకీ ఫైనల్ వర్క్ కి రెడీ అవుతున్నారు సినిమా బృందం. అది పూర్తి ఐన తరవాత పాటలు ఉంటాయి. జులై లో విడుదల ప్లాన్ చేసారు కానీ మరొక పక్క ఇదే సంస్థ వారు బాబు బంగారం విడుదల కి సిద్దం అవుతుంది జూలై కి సో ఆ లెక్కలో మరొక నెల వెనక్కి వెళ్ళాల్సి ఉంది విడుదల కి. ఏదేమైనా నాగార్జున - వెంకటేష్ కలిసి ఒకే సినిమా లో కీలక రోల్స్ ప్లే చేస్తూ ఉండడం తో ఈ సినిమాకి బయ్యర్ లు కూడా ఎగబడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: