వర్షం సినిమా - తెలుగు సినిమా పంథా లో సాగిన ఒక కొత్త ఆసక్తికర చిత్రం గా ఇది అందరికీ గుర్తుండి పోతుంది. త్రిషా - ప్రభాస్ ల మధ్యన రోమాన్స్, ప్రభాస్ మ్యాన్లీ లూక్స్ తో ఫైట్ లూ ఇవన్నీ అదరహో అనిపిస్తాయి. ఈ సినిమాకి మరొక హై లైట్ గా గోపీ చంద్ విలనిజం గురించి చెప్పుకోవచ్చు. ఈ సినిమా హిందీ లో తీస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అనే కంటే ఎలా ఉండకూడదు అనేలా తీసారు దర్శకుడు సబ్బీర్ ఖాన్. వర్షం డీవీడీ ని చూసి కూడా ఉండడు అన్నట్టు గా తీసాడు ఈ సినిమాని అక్కడ.



రెయిడ్ రిడెంప్షన్ అనే సినిమానీ వర్షం సినిమానీ కలిపేసి కిచిడీ చేసేసాడు డైరెక్టర్. దాన్ని భాగీ అనే పేరుతో హిందీ లో విడుదల చేసాడు. నటన కాస్త కూడా రాని టైగర్ ష్రాఫ్ అండ్ శ్రద్దా కపూర్.. రొమాన్స్ పలికించండి వారు మాత్రం ఏం చెయ్యగలరు . ఫస్ట్ హాఫ్ లో వర్షం ని పూర్తిగా పాడు చేసిన మనోడు, సెకండ్ హాఫ్ కూడా సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేక మార్షల్ సినిమాగా తీసాడు. ఏదేమైనా కొన్ని క్లాసిక్ లని టచ్ చెయ్యకూడదు అనే ఫీల్ మళ్ళీ భాగీ చూస్తే అనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: