‘సరైనోడు’ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు బోయపాటి శ్రీను. తన 12 ఏళ్ల కెరీర్ లో బోయపాటి 6 సినిమాలు తీస్తే అందులో 5 బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో టాలీవుడ్ టాప్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు బోయపాటి. ఈయన అభిమానులు అయితే మరో అడుగు ముందుకు వేసి రాజమౌళి తరువాత అంత సక్సస్ ట్రాక్ ఉంది ఒక్క బోయపాటికే అంటూ కామెంట్ చేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో ఒక మీడియా సంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయపాటి అల్లు కాంపౌండ్ కు సంబంధించిన ఒక సీక్రెట్ ను బయట పెట్టాడు. ఒక దర్శకుడు అల్లు కాంపౌండ్ లోకి ఎంటర్ అయి బన్నీతో సినిమా తీయడానికి ప్రయత్నించడానికి ఎన్ని మెట్లు దాటాలో చాల ఆ సక్తికరంగా వివరించాడు. 

ముందుగా అల్లు అర్జున్ ఫ్రెండ్ బన్నీ వాసుకు కథ వినిపించాలట.  ఆతరువాత అల్లు అరవింద్ సోదరికి కథ చెప్పాలట. ఆమెకు  సినిమాపై చాలా నాలెడ్జ్ ఉందట. ఆమె ఒకే చెప్పిన తరువాత అల్లుఅర్జున్ అ తరువాత అరవింద్ కథ వింటారని ఇన్ని మెట్లు దాటి అల్లు కాంపౌండ్ లో కథను ఒప్పించడం ఎంత కష్టమో వివరించాడు బోయపాటి. 

ఇదే సందర్భంలో బోయపాటి మాట్లాడుతూ కథను ఇంతమంది వినడంలో ఏమి తప్పులేదు అని అంటూ తాను కూడ ఏ కథ వ్రాసినా  తన జాయింట్ ఫ్యామిలీలోని అందరికీ కథ నేరేట్ చేస్తాను అని అంటూ  వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకుంటాను అని అంటున్నాడు బోయపాటి. అంతేకాదు తాను ప్రతి సినిమాకు చాలా హోమ్ వర్క్ చేస్తానని అదే తన సక్సస్ సీక్రెట్ అని అంటున్నాడు. ఈ వార్తలు ఇలా ఉండగా ‘సరైనోడు’ కు సరైన పోటీ ఇచ్చే సినిమాలు ఏమి లేకపోవడంతో ఈసినిమా కలక్షన్స్ ‘శ్రీమంతుడు’ రికార్డును బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు..  


మరింత సమాచారం తెలుసుకోండి: