కోలీవుడ్ భామ నందిత శ్వేత అంటే తెలియని వారుండరు.. మొదటి సినిమా కన్నడలో చేసినా తమిళంలో వరుస సినిమాలతో క్రేజ్ ను సంపాదించింది శ్వేత. నంద లవ్స్ నందిత అనే కన్నడ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైన ఈ భామ బెంగుళూరులో పుట్టి పెరిగింది. ఇక నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ చేస్తూ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.


మొదటి సినిమాలోనే ఎంతో గొప్ప అభినయాన్ని కనబరిచిన శ్వేత ఆ సినిమాలో తన పాత్ర అయిన నందితను స్క్రీన్ నేంగా మార్చుకుని నందిత శ్వేతగా మారింది. ఇక తమిళంలో చేసిన మొదటి సినిమా అట్టకత్తి  పా. రంజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా కోలీవుడ్లో నందిత శ్వేతకు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది.


2012 మొదలు సక్సెస్ ఫుల్ గా 9 కోలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తనకు ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి నూటికి నూరు పాళ్లు న్యాయం చేస్తుంది ఈ భామ. ఓ పక్క కుర్ర హీరోలతో నటిస్తూ మరో పక్క స్టార్ హీరోల సినిమాల్లొ అడపాదడపా క్యారక్టర్స్ చేస్తుంది నందితా శ్వేత.


రీసెంట్ గా అంజలా సినిమాతో తమిళ ప్రేక్షకులను పలుకరించిన ఈ భామ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ హీరోయిన్ అయ్యింది. చిన్న బడ్జెట్ దర్శక నిర్మాతలకు అమ్మడు ఓ మంచి ఆప్షన్ అని చెప్పాలి. సో కెరియర్ స్టార్ట్ చేసిన అనతి కాలంలోనే స్టార్ క్రేజ్ సంపాదించిన నందిత శ్వేత ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటుంది. మరి ఇలాంటి సక్సెస్ ఫుల్ పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని.. ఆమె కెరియర్లో ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవాలని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: