రాజా చెయ్యి వేస్తే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన తారకరత్న సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే తన వరకు సూపర్ అనిపించుకున్నాడు. విజయ్ మాలిక్ అనే క్రూరుడిగా తారకరత్న పలికించిన విలనిజం సినిమాలో బాగా వర్క్ అవుట్ అయ్యాయి. అయితే సినిమాలో దమ్ము లేకపోవడం వల్ల ఆడియెన్స్ పెదవివిరిచారు. అయితే రాజా ఆఫర్ తారకరత్నకు మెగా ఆఫర్ ను తెచ్చి పెట్టిందని ఫిల్మ్ నగర్ టాక్. 


మెగా ఆఫర్ అంటే మెగా ఫ్యామిలీ ఆఫర్ కాదు కదా అంటే.. మెగా హీరో ఆఫరే తారకరత్న దరికి చేరింది. ఇన్నాళ్లు హీరోగా చేసి ఇక అలా కాదని విలన్ గా మారిన తారకరత్న మంచి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాడు. ప్రదీప్ డైరెక్ట్ చేసిన రాజా చెయ్యి వేస్తే సినిమాలో తారకరత్నను చూపించే విషయంలో ఓకే అనిపించుకున్నాడు. 


రాజా చెయ్యి వేస్తేలో తారకరత్న :


అయితే రాజా చెయ్యి వేస్తేలో తారకరత్నను చూసి మెగా హీరో సాయి ధరం తేజ్ విలన్ గా మాట్లాడాడట దర్శకుడు గోపిచంద్ మలినేని. సాయి ధరం తేజ్, గోపిచంద్ మలినేని కాంబోలో ఓ సినిమా రాబోతుంది. ఆ సినిమా విలన్ గా తారకరత్నను తీసుకునే ఆలోచనతో మాట్లాడటం జరిగిందట. అయితే తారకరత్న ఇంకా నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు.


సో రాజా చెయ్యి వేస్తే సినిమా నారా రోహిత్ కు ఎంత లాభం తెచ్చిందో ఏమో కాని తారకరత్నకు మాత్రం సినిమా అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఇక తనంతట తానే బాబాయ్ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో ఏ చిన్న రోల్ అయినా చేస్తానన్నాడు కాబట్టి బాలయ్య సపోర్ట్ తో కచ్చితంగా సినిమాలో ఏదో ఓ పాత్రలో తారకరత్న కనిపించే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: