యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా నటించబోతున్న అప్ కమింగ్ ఫిల్మ్‘శభాష్ నాయుడు’. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా కమల్ హాసన్ తనదైన ప్రతిభని చూపించారు. తాజాగా భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌, ఇప్పుడు కమల్ హాసన్ తో ఓ మూవీని ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని ఏకకాలంలో పూర్తి చేయనున్నారు.


మళయాల దర్శకుడు టీ.కే.రాజీవ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం చేపట్టనున్నారు. అయితే ఈ సినిమాకి తెలుగు, తమిళ భాషల్లో ‘శభాష్ నాయుడు’అన్న పేరు పెట్టగా హిందీ లో ’శభాష్ కుండు’ అని పేరు పెట్టారు. ఇక్కడి వరకూ బాగానే ఉన్నప్పటికీ...తెలుగులో ‘శభాష్ నాయుడు’ పేరుకి కొంత వ్యతిరేకత ఏర్పడుతుంది.


తెలుగు రాష్ట్రాల్లో కులాల గోల ప్రస్తుతం ఎక్కువుగా ఉన్న ఈ సమయంలో, ‘శభాష్ నాయుడు’ చిత్రంపై కొంత మంది అభ్యంతరాలకు తెరలేపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ సమాచారాన్ని చిత్ర యూనిట్ కి కుల సంఘ పెద్దలు చేరవేసినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. 


దశావ‌తారం సినిమాలో క‌మ‌ల్ పోషించిన తొమ్మిది పాత్ర‌ల్లో ఒకటైన పోలీస్ ఆఫీస‌ర్ నాయుడు పాత్ర కారణంగా ఈ సినిమా ‘శభాష్ నాయుడు’ టైటిల్ ని పెట్టాల్సి వచ్చిందని కమల్ చెబుతున్నప్పటికీ...ఈ పేరు నాయుడు కాస్ట్ వాళ్ళకి ఇబ్బంది కరంగా మారుతుందని కొందరు భావిస్తున్నారు. ఇంకా మూవీ సెట్స్ పైకి వెళ్లకుండానే అప్పుడే టైటిల్ పై హాట్ టాపిక్స్ నడవటం చిత్ర యూనిట్ ని కలవర పెడుతుందని అంటున్నారు. ఈ సినిమాలో ర‌మ్య‌కృష్ణ క‌మ‌ల్ హాసన్ కు జోడీగా నటించడం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: