మెగా ఫ్యామిలీని ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ లను ఎదో ఒక విషయంలో ఇరుకున పెడుతూ వారి పై షాకింగ్ కామెంట్స్ చేసే రామ్ గోపాల వర్మ పవన్ కళ్యాణ్ ను ‘బెగ్గర్ సింగ్’ గా మారవద్దు అంటూ చాల ఘాటైన సెటైర్లు వేసాడు. ఇప్పటి వరకు వర్మ ఎన్నో కామెంట్స్ పవన్ పై చేసినా ఈ స్తాయిలో ఇంత ఘాటుగా ఎప్పుడూ వర్మ పవన్ ను టార్గెట్ చేయలేదు. 

ఇప్పటిదాకా వర్మ పేల్చిన ట్విట్టర్‌ 'సెటైర్‌ బాంబుల్లో' ఇదే పవర్ ఫుల్ బాంబ్ అని అంటున్నారు.  ‘ఫ్లాపయినా గబ్బర్‌సింగే కావాలి.. బెగ్గర్‌ సింగ్‌ వద్దు’ అన్నది వర్మ సెటైర్‌. 'విన్నపాలు చేస్తే కాదు, పోరాడితేనే ప్రత్యేక హోదా వస్తుంది' అంటూ పవన్‌కళ్యాణ్‌పై మరో సంచలన వ్యాఖ్యలు చేసాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు తనకు పవర్‌ ఇచ్చిన కాపుల్ని పవన్‌కళ్యాణ్‌ పేదోళ్ళను చేశాడంటూ అంటూ మరో షాకింగ్ ట్విట్ చేసి పవన్‌ మైండ్ ను బ్లాంక్ చేసాడు వర్మ.

సామాన్యంగా వర్మ కామెంట్స్ ను పట్టించుకునే వారు తగ్గిపోతున్న నేపధ్యంలో వర్మ లేటెస్ట్ గా పవన్ ను టార్గెట్ చేసిన ఈ ఘాటైన కామెంట్స్ మటుకు చాలామందిని ఆలోచింప చేయడమే కాకుండా పవన్ అభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ ఆరాధించే అతని వీరాభిమానులకు కూడ పవన్ నిన్న తన ట్విటర్ లో వాడిన ‘విన్నవించుకుంటున్నాను’ అన్న పదం తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది అన్నది వాస్తవం.

ఇప్పటిదాక ఏ విషయం పై అయినా ఆవేశంగా మాట్లాడే పవన్ నోటి వెంట ఈ విన్నపాల మాటలు ఏమిటి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. దీనికితోడు వివాదాల రామ్ గోపాల వర్మ కామెంట్స్ కూడ జత చేరాయి కాబట్టి పవన్ ఈ విషయమై ఇప్పటికైనా జనం నమ్మేలా వ్యవహరిస్తే బాగుంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: