బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు సంబంధించి యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ కోసం మరి కొద్ది రోజులలో ఈ సినిమా యూనిట్ మొరాకో బయలుదేరాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాత రాజీవ్ రెడ్డి ఈ సినిమా ఆర్ట్ డైరెక్టర్ భూపతి మొరాకో చేరుకొని ఈ సినిమా యుద్ధ సన్నివేశాల చిత్రీకరణకు కావలసిన ఏర్పాట్లను చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

దాదాపు 8 వందల మొరాకో దేశానికి సంబంధించిన జూనియర్ ఆర్టిస్టులను ఈ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఇప్పటికే ఎంపిక చేసినట్లు ఈ సినిమా నిర్మాత చెపుతున్నాడు. షుమారు 4 టన్నుల బరువు ఉండే రకరకాల యుద్ధ పరికరాలను ఆయుధాలను హైదరాబాద్ లో ప్రత్యేకంగా తయారు చేయించి ఆ ఆయుధాలను ఇప్పటికే మొరాకో చేరవేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

షుమారు నెల రోజులు పాటు ఏకబిగువున జరిగే ఈ షెడ్యూల్ లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కోటకు సంబంధించిన కీలక సన్నీవేసాలతో పాటు భారీ యుద్ధ సీన్స్ కూడ చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ షెడ్యూల్ కోసమే 8 కోట్లు ఖర్చు అవుతుందని ఈసినిమా నిర్మాత చెపుతున్నాడు. ఇప్పటికే ఈసినిమా పాటల రికార్డింగ్ కు సంబంధించిన సిటింగ్స్ దేవిశ్రీప్రసాద్ ఆద్వర్యంలో అమెరికాలో జరుగుతున్న నేపధ్యంలో ఈసినిమా మ్యూజిక్ కు కూడ చాల ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మొరాకాలో చిత్రీకరణ జరుపుకున్న ‘గ్లాడియేటర్’, ‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటన్స్’ లాంటి ఎన్నో హాలీవుడ్ చిత్రాలు చరిత్ర సృష్టించిన నేపధ్యంలో అటువంటి చరిత్రనే తన 100వ సినిమా ద్వారా సృష్టించాలని బాలయ్య చేస్తున్న ప్రయత్నాలు మరో సంచలనాన్నిసృష్టిoచే  అవకాశం ఉంది అని అంటున్నారు.. 



మరింత సమాచారం తెలుసుకోండి: