బాలకృష్ణ అభిమానులందరూ మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎదురు చూస్తూ ఉంటే బాలయ్య మోక్షజ్ఞ విషయంలో తీసుకున్న ఆశ్చర్యకర నిర్ణయం బాలయ్య అభిమానులకు షాకింగ్ న్యూస్ గా మారింది. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం మోక్షజ్ఞ బాలయ్య 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కి దర్శకుడు క్రిష్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. 

దీనికి కారణం మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే ముందు సినిమా నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా నటనకు సంబంధించి అన్ని విషయాలు క్షుణ్ణంగా నేర్చుకోవాలి అనే ఉద్దేశ్యంతో బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. త్వరలో మొరాకోలో ప్రారంభం కానున్న ఈసినిమా యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో మోక్షజ్ఞ క్రిష్ దగ్గర సహాయకుడుగా పనిచేస్తాడని తెలుస్తోంది.

ఈసినిమాలో బాలయ్య వారసుడు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించే విషయంలో క్లారిటీ లేకపోయినా మోక్షజ్ఞ్జ ఈసినిమాకు సహాయ దర్సకుడుగా పనిచేయడంఖాయం అని అంటున్నారు. బాలకృష్ణ సినిమాలలో హీరోగా మారకముందు తన తండ్రి నందమూరి తారక రామారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సెంటి మెంట్ తో అదే విషయాన్ని మోక్షజ్ఞ విషయంలో కూడ బాలకృష్ణ అనుసరించడానికి నిర్ణయం  తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మన దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి కమలహాసన్ అదేవిధంగా టాలీవుడ్ లో రవితేజ నానిలాంటి హీరోలు మొదట్లో సహాయ దర్శకులుగా పనిచేసి ఆ తరువాత టాప్ హీరోలుగా ఎదిగిన నేపధ్యంలో అదే తరహా సెంటిమెంట్ ను బాలయ్య తన కొడుకు విషయంలో అమలు పరుస్తున్నాడు అనుకోవాలి. ఏది ఏమైనా యంగ్ హీరోగా మోక్షజ్ఞను త్వరలో చూద్దామని కలలు కంటున్న బాలకృష్ణ  అభిమానులకు ఈ న్యూస్ షాకింగ్ న్యూస్ అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: