తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా పర్వాలేదనిపించుకున్న పూనం బజ్వా దర్శకుడు సునీల్ రెడ్డిని రహస్య వివాహం చేసుకుందని ఓ రెండు రోజుల నుండి రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి.. రిజిస్ట్రార్ ఆఫీస్ లో వీరు సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నారని టాక్ వచ్చింది. అయితే ఈ రూమర్లకు చెక్ పెట్టేసింది పూనం బజ్వా. 


తనపై వస్తున్నవన్ని రూమర్లని.. తనకు సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడింది. ఈ మధ్యనే తన సిస్టర్ మ్యారేజ్ అయ్యిందట..బహుశా అది తనదే అనుకుని మీడియా వారు అలా రాసి ఉంటారని అంటుంది. అయినా సరే తాను మీడియాను ఏమి తప్పు పట్టలేదు. ప్రపంచం మొత్తం నాతో ఉంది నేను ఎలాంటిదాన్నో నాకు తెలుసు అంటుంది.


కళావతి మూవీలో పూనం బజ్వా :


ఇక ఈ పెళ్లి వార్తతో దర్శకుడు సునీల్ రెడ్డి కూడా షాక్ అయ్యాడు. కళ్యాణ్ రాం ఓం 3డి సినిమా డైరెక్ట్ చేసిన సునీల్ రెడ్డి కెరియర్లో ఇంకా ఓ మంచి ఫ్లాట్ ఫాంను ఏర్పాటు చేసుకోలేదు. ఇక పూనం ఇచ్చిన కిలారిటీతో ఊపిరి పీల్చుకున్నాడు సునీల్ రెడ్డి. 


పూనం బజ్వా తెలుగులో కూచిపూడి వెంకట్ మొదటి సినిమాతో పరిచయమైంది.. ఆ తర్వాత హీరోయిన్ గా కాకుండా సైడ్ క్యారక్టర్స్ చేస్తుంది. బాస్, పరుగు సినిమాల్లో పూనం నటించింది. మరి పెళ్లి వార్తతో ఇద్దరు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారన్నది తెలిసిన సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: