సౌత్ సూపర్ స్టార్ రజిని మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యాడు. పా. రంజిత్ దర్శకత్వంలో కబాలిగా రాబోతున్న రజినికాంత్ సినిమాలో మాఫియా డాన్ గా కనిపించనున్నారు. అయితే నిన్న రిలీజ్ అయిన తెలుగు, తమిళ టీజర్ కు అందరు మరోసారి దట్ ఈజ్ తలైవా అనేలా చేశాడు రజిని. తనకు మాత్రమే సొంతమైన స్టైల్ తో టీజర్ లోనే సినిమా చూపించేశాడు. 


ముందు తమిళ టీజర్ రిలీజ్ చేసిన నిర్మాత కలైపులి ఎస్.థను తెలుగు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. మిడిల్ ఏజ్ లుక్ తో గడ్డంతో రజిని లుక్ నిజంగా అదరగొట్టేస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చితక్కొట్టాడని చెప్పాలి. రాధికా ఆప్టె హీరోయిన్ గా అంటిస్తున్న ఈ సినిమాతో రజిని మరోసారి తన స్టామినా చూపించబోతున్నారు.


కబాలిలో రజిని లుక్ :


ఈ నెల మూడో వారంలో ఆడియో రిలీజ్ చేసుకోబోతున్న కబాలి జూన్ నెలలో రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. విక్రమ సింహా, లింగా సినిమాల ఫ్లాపులతో అపవాదాలు మూటకట్టుకున్న రజిని ఈ కబాలితో వాటిననంటిని అధిగమించాలని చూస్తున్నాడు. టీజర్ చూస్తుంటే సినిమా రికార్డుల సునామి సృష్టించడం ఖాయం అనిపించేస్తుంది. 


మరి రజిని స్టైల్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి. ప్రస్తుతం నిర్మాణనంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంటున్న చిత్రయూనిట్ త్వరలో సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకు రానున్నారు. మరి కబాలి తెలుగు టీజర్ మీరు చూసి ఆనందించండి.. ఇప్పటికే ఈ టీజర్ చూసిన సిని ప్రముఖులు చిత్రయూనిట్ మీద రజిని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: