సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న బ్యూటీ సమంత. స్టార్ డైరెక్టర్స్ అంతా సమంత కాల్షీట్స్ కోసం క్యూలు కట్టుకొని ఎదురుచూస్తుంటే, ఓ డైరెక్టర్ మాత్రం సమంత కాల్షీట్ దొరికినా, తనపై ఫైర్ అయి మూవీ నుండి తప్పించాడని అంటున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఈ సమాచారంపై వివరాలను చూస్తే, సమంత ప్రస్తుతం అటు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, ఇటు టాలీవుఢ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోల సరసన నటిస్తుంది.


ఇంకా ఈ బ్యూటీకి మంచి డిమాండ్ ఉన్న ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో సమంతకి మరో రెండు సంవత్సరాలకి సరిపడా ఆఫర్స్ ఉన్నాయి. ఇక కోలీవుడ్ కి చెందిన టాప్ డైరెక్టర్…సమంతకి మరో కథని చెప్పటానికి  సిద్ధపడ్డాడు. అందుకు సమంత సైతం కథని విన్న తరువాత, కథలో హీరోయిన్ కి ఎక్కువ సీన్స్ ఉండేలా ప్లాన్ చేయాలని చెప్పుకొచ్చింది. 


కథా పరంగా హీరోయిన్ కి తక్కువ సీన్స్ ని ఉంచిన ఆ డైరెక్టర్, ఇప్పుడు సమంత కోరిక మేరకు కొన్ని సీన్స్ ని సైతం పెంచారు. ఆ తరువాత పెంచిన సీన్స్ తో మళ్ళీ కథని విన్న సమంత, తన పాత్రలో కొద్దిపాటి మార్పులు కావాలని సూచించిదట. దీంతో ఆ టాప్ డైరెక్టర్ ఫైర్ అయి, మార్పులు చేసేది లేదు…ఈ ప్రాజెక్ట్ కి మీరు ఎంత మాత్రం అవసరం లేదని వెళ్ళిపోయాడు. దీంతో సమంత షాక్ అయింది.


చాలా కాలం తరవాత ఓ టాప్ డైరెక్టర్ తన వద్ద నుండి ఇలా వెళ్ళిపోవటం మొదటి సారి అని అంటున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇక కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అయితే టాప్ డైరెక్టర్ సమంతపై కోప్పాడ్డాడు అంటూ కథనాలు వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: