సినిమా పరిశ్రమలో ఎవరు ఎవరికి ఏమవుతారు అన్నది కాస్త కన్ ఫ్యూజన్ గానే ఉంటుంది. కాస్త క్లోజ్ గా ఉన్నంత మాత్రానా హీరో హీరోయిన్ మధ్య ఏవేవో జరుగుతున్నట్టు రాయడం మీడియా వారికి అలవాటే.. కాని డైరెక్ట్ గా ఓ ఇంటర్వ్యూలో నందమూరి హీరోని స్టార్ హీరోయిన్ అన్నా అనేయడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏ నందమూరి హీరోని.. ఏ స్టార్ హీరోయిన్ అన్నా అని పిలిచిందో తెలుసుకోవాలంటే వివారాల్లోకి వెళ్లాల్సిందే.


నందమూరి అభిమానుల సపోర్ట్ తో నారా వారి కుటుంబం నుండి హీరోగా పర్వాలేదనిపించుకున్నాడు రోహిత్. సినిమాలైతే తీస్తున్నాడు కాని అవి హిట్ ట్రాక్ మాత్రం ఎక్కట్లేదు. నెలకో సినిమా రిలీజ్ చేస్తున్న రోహిత్ రీసెంట్ గా రాజా చెయ్యి వేస్తే అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో విశేషం ఏంటంటే నందమూరి హీరో తారకరత్న విలన్ గా చేయడం.


కొద్దికాలంగా సినిమాలేవి చేయని తారకరత్న రాజా చెయ్యి వేస్తేలో విలన్ గా చేయడం అందరిని షాక్ కు గురిచేసింది. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నారా రోహిత్ తర్వాత నటిస్తున్న జ్యో అచ్యుతానంద హీరోయిన్ రెజినాతో స్పెషల్ ఇంటర్వ్యూ ఏర్పాటుచేశాడు. ఆ ఇంటర్వ్యూలో రెజినాతో తారకరత్న పాల్గొన్నాడు. సినిమాకు సంబందించిన ప్రశ్నలను అడుగుతూ తారకరత్నను అన్నా అని సంభోదించింది రెజినా. 


స్టార్ హీరోయిన్ గా ఉన్న రెజినా తారకరత్నను అన్నా అని పిలవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి తారకరత్నను ఆమె అన్నా అని పిలవడంలో ఉన్న కారణాలేంటో తెలియలేదు. మొత్తానికి స్టార్ హీరోయిన్ చేత అన్నా అనిపిలిపించుకున్న క్రెడిట్ తారక రత్నకు దక్కింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: