నిన్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ దృష్టి ఈరోజు రాజమౌళి పై పడింది. నిన్న విడుదలైన రజినీకాంత్ ‘కబాలి’ టీజర్ గురించి వర్మ కామెంట్ చేస్తూ ‘కబాలి సినిమా బాహుబలి కా బాప్’ అంటూ రజినీకాంత్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు ఈ సినిమాను ఫస్ట్ డే 4 సార్లు చూస్తానని తన ట్విటర్ లో కామెంట్ చేసాడు. 

ఈ పాత్రను రజినీ కాంత్ తప్ప మరెవ్వరూ చేయలేరు అంటూ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే వర్మ ఈసినిమాను ‘బాహుబలి కా బాప్’ అని అభివర్ణించడంతో ‘బాహుబలి’ రకార్డులను ‘కబాలి’ తుడిచి వేస్తుంది అన్న సంకేతాలు ఇస్తున్నట్లు ఉంది. ‘బాహుబలి’ రికార్డులను ‘బాహుబలి 2’ తిరగ రాస్తుంది అని రాజమౌళి భావిస్తూ ఉంటే మధ్యలో ‘కబాలి’ ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుంది అనే భావన వర్మ మాటలలో రావడం రాజమౌళికి ఊహించని షాక్ అనుకోవాలి.

ఈ వార్తలు ఇలా ఉండగా నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ కు విపరీతమైన స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా తెలుగు డబ్బింగ్ ను విడుదల చేయకుండా అడ్డుకోవాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ లో కొందరు లిఖిత పూర్వక అభ్యంతరాలు తెలియచేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

రజినీకాంత్ గతంలో నటించిన ‘కొచ్చాడియన్’ సినిమాను ‘విక్రమ సింహ’ పేరుతో తెలుగులో విడుదల చేసిన లక్ష్మి గణపతి డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన భారీ నష్టాలను తీరుస్తానని రజినీకాంత్ భార్య 7.60 లక్షలకు ఇచ్చిన వ్రాత పూర్వక కమిట్మెంట్ ను నిలుపుకొని నేపధ్యంలో ఈ ‘కబాలి’ సినిమా విడుదలను ఆపుచేయాలని ఈ లక్ష్మి గణపతి డిస్ట్రిబ్యూటర్స్ అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టేసారు అన్న వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తూ ఉంటే విడుదల కాకుండానే ‘కబాలి’ కి కష్టాలు మొదలయ్యాయి అనుకోవాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: