రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్వీట్ చేశాడు. ఐతే.. ఈసారి తన తాజా ట్వీట్ లో ఎప్పుడూ పొగిడే దర్శక దిగ్గజం రాజమౌళిని ఇరుకున పడేసేదిగా ఉండటం విశేషం. సాధారణంగా రామ్ గోపాల్ వర్మ రాజమౌళిని పొగుడుతూ ఉంటారు. తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని తెగమెచ్చుకున్నారు. అంతేకాదు.. పవన్ ను తిట్టాల్సి వచ్చినప్పుడు కూడా వర్మ రాజమౌళిని ఉపయోగించుకున్నారు. 

బాహుబలి తెలుగు సినిమాను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తే.. పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ దాన్ని తిరిగి నేలకు దించి పాతాళంలో పాతి పెట్టాడని ట్వీట్ చేశారు. ఇది పవన్ ఫ్యాన్స్ కు విపరీతంగా కోపం తెప్పించింది. ఇలా ఒకరిని పొగడాలంటే మరొకరిని కామెంట్ చేయడం వర్మకు ఓ అలవాటు. కంపారిజన్ ఉంటే కానీ పబ్లిక్ ఫీల్ కారు అన్నది ఆయన సిద్ధాంతమేమో. 

కబాలి.. బాహుబలి బాపులా ఉందంట.. 


తాజా రిలీజైన రజినీకాంత్ కొత్త సినిమా కబాలి టీజర్ పై వర్మ ట్విట్టర్ ద్వారా కామెంట్స్ చేశారు. కబాలి టీజర్లో రజినికాంత్ ఔట్ స్టాండింగ్ పెర్ ఫార్మెన్స్ చూపించారని ఆకాశానికెత్తేశాడు. అసలు రజినీకాంత్ లో స్క్రీన్ ను ఎవరూ వైబ్రేట్ చేయలేరని తేల్చి చెప్పేశాడు. ఈ కబాలి సినిమాను రిలీజ్ రోజు వరుసగా నాలుగు షోలు చూడాలనుకుంటున్నానని ట్వీట్ చేశాడు. 

అంతవరకూ బాగానే ఉంది. అక్కడే మొదలైంది వర్మలోని తిక్కదనం. కబాలిని చూస్తే బాహుబలి బాప్ లా ఉంది అంటూ చిట్టచివరి అస్త్రాన్ని ప్రయోగించాడు వర్మ. కబాలి ఈజ్ లుకింగ్ లైక్ బాహుబలి కా బాప్.. వన్ అండ్ ఓన్లీ రజినీకాంత్ అంటూ ట్వీట్ ద్వారా అభిమానం చూపించారు రామ్ గోపాల్ వర్మ. ఓవైపు రజినీకాంత్ ను పొగుడుతూనే బాహుబలి బాపులాగా ఉంది అనడం.. రాజమౌళిని కించపరచడమే అంటున్నారు దర్శకధీరుడి ఫ్యాన్స్. మరి రాజమౌళి ఎలా స్పందిస్తాడో..!



మరింత సమాచారం తెలుసుకోండి: