‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఘోరమైన ఫ్లాప్ గా మారడం వెనుక ఆ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలలోనూ మితిమీరిన అత్యుత్సాహంతో అన్నీ తానై పవన్ వ్యవహరించిన తీరు అనే కామెంట్స్ ఉన్న విషయం తెలిసిందే. ‘సర్దార్’ ఘోర పరాజయం తరువాత అతడి వీరాభిమానులు కేవలం పవన్ ను నటించమని ఇంక ఏ పనులు చేయవద్దని పవన్ ను ప్రాధేయ పడుతూ అనేక కామెంట్స్ కూడ పెట్టారు. దీనితో పవన్ పూర్తిగా మారిపోతాడు అనుకున్నారు అంతా.

అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ ఎస్.జె. సూర్యాల కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న సినిమా స్క్రిప్ట్ వ్యవహారంలో పవన్ మళ్ళీ తన సూచనలు చేస్తున్నాడని టాక్. ముఖ్యంగా ఈసినిమాకు స్క్రిప్ట్ ను అందిస్తున్న ఆకుల శివకు ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాలు ఎలా డిజైన్ చేయాలి అన్న విషయమై రచయిత శివకు సలహాలు ఇవ్వడమే కాకుండా స్క్రిప్ట్ పూర్తిగా తయారు కాకుండా షూటింగ్ గురించి హడావిడి వద్దు అని దర్శకుడు ఎస్.జె. సూర్యాకు నిర్మాత శరత్ మరార్ కు గట్టి సూచనలు ఇచ్చినట్లు టాక్. 

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఉత్సాహం ఈసారి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న అనూప్ రూబెన్స్ పై కూడ మళ్ళింది అని ఫిలింనగర్ గాసిప్. ఈ సినిమాకు సంబంధించి జరుగుతున్న మ్యూజిక్ సిటింగ్స్ విషయంలో అనూప్ రూబెన్స్ కు పాటల కంపోజింగ్ పై కూడ పవన్ సూచనలు ఇస్తున్నట్లు టాక్. దీనితో అనూప్ రూబెన్స్ తనకు పిలిచి అవకాశం ఇచ్చిన పవన్ మాటలు కాదనలేక పాటల ట్యూనింగ్ విషయంలో పవన్ చెపుతున్న సలహాలను పాటించలేక సతమతమవుతున్నట్లు టాక్. 

పాటల ట్యూనింగ్ విషయంలోనూ ఆర్కెస్ట్రా విషయంలోను సింగర్స్ సెలక్షన్స్ విషయంలోనూ పవన్ రకరకాల సలహాలను అనూప్ రూబెన్స్ కు ఇచ్చి పవన్ ఏకంగా అనూప్ రూబెన్స్ కు మ్యూజిక్ మాస్టార్ గా మారిపోయినట్లు ఫిలింనగర్ న్యూస్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: