విలక్షణ నటుడు సూర్య నటిస్తున్న 24 సినిమా రిలీజ్ అవుతున్న ఈ తరుణంలో అతని జీవితానికి చెందిన విషయాలు బయటపడుతున్నాయి. సూర్య ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడంటే అందులో తన తండ్రి శివకుమార్ పాత్ర చాలా ఉంది. తానో నటుడిగా పెరుగుతూ తన ఇద్దరు కొడుకులను హీరోలను చేశాడు శివకుమార్. ఇక ప్రస్తుతం మన అందరం ఇష్టపడుతున్న సూర్య అసలు పేరు కూడా సూర్య కాదట. శరవణన్ అయితే సూర్యగా మార్చాడట ఓ దర్శకుడు. 


ఇంతకీ శరవణన్ గా ఉన్న తనని సూర్యగా మార్చిన దర్శకుడు ఎవరు అంటే.. మణిరత్నం అంటున్నారు. సూర్య నటిస్తున్న తొలినాళ్లలో శరవణన్ అనగానే అదే పేరుతో ఆల్రెడీ ఓ నటుడు ఉండటంతో తనకు సూర్య అని స్క్రీన్ నేం పెట్టేశాడు మణిరత్నం. ఇక అప్పటి నుండి సూర్య వెనక్కి తిరిగి చూసుకోలేదు. కెరియర్ లో కష్టానికి మారుపేరుగా క్రేజ్ సంపాదించిన సూర్య పాత్ర ఏదైనా ఎంత కష్టమైనా సరే తాను చేయడానికి సిద్ధం అన్నట్టు ఉంటాడు. 


24 లో సూర్య :


ప్రస్తుతం 24 సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. విక్రం కుమార్ కథ నచ్చడంతో తానే ఈ సినిమాను నిర్మిచాలని నిర్ణయించుకున్నట్టు సూర్య అన్నారు. సమంత, నిత్యా మీనన్ నటించిన ఈ సినిమా తప్పక ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఈ నెల 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సూర్య 24 సినిమా టైం మిషన్ నేపథ్యంలో వస్తుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, సాంగ్స్ సినిమా మీద భారీ అంచలాను ఏర్పడేలా చేసింది. అంతేకాదు సూర్య ఈ సినిమా మీద ఉన్న అపార నమ్మకంతో యూ.ఎస్ లో 267 థియేటర్స్ లో రిలీజ్ చేయడం విశేషం.   


మరింత సమాచారం తెలుసుకోండి: