టాలీవుడ్లో ఓ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది అంటే మెగా హీరోల కన్ను వారిపై ఉంటూనే ఉంటుంది. అంతేకాదు ఒక్క సారి మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ అయ్యిందంటే ఇక వరుసెంట మెగా హీరోల సినిమాల్లో చేస్తూనే ఉంటారు. ప్రస్తుతం మెగా హీరోలను తన మాయలో పడేసుకుంది ఓ భామ. ఆమె ఎవరో కనిపెట్టడం పెద్ద విశేషమే కాదు వరుసెంట మెగా ఆఫర్లను చేజిక్కించుకుంటున్న మెగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.


బ్రూస్ లీ సినిమాలో చెర్రి, రకుల్ :


అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్లో హీరోయిన్ కొరత ఉందని కనిపెట్టేసిన ఈ అమ్మడు త్వరగానే లైం లైట్లోకి వచ్చింది. ఇక మెగా పవర్ స్టార్ రాం చరణ్ సరసన బ్రూస్ లీ సినిమాలో నటించిన రకుల్ ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే అమ్మడి అందాలకు మెగా అభిమానులు ఫిదా అయ్యారు.


ఇక అదే జోష్ తో రీసెంట్ గా సరైనోడులో మహాలక్ష్మి పాత్రలో రకుల్ అదరగొట్టేసింది. మెగా హీరోలతో మొదటి హిట్ అందుకున్న రకుల్ ప్రస్తుతం రాం చరణ్ నటిస్తున్న తని ఒరువన్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తుంది. అదే కాదు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ గోపిచంద్ మలినేని కాంబోలో వస్తున్న సినిమాలో కూడా రకుల్ నే హీరోయిన్ గా తీసుకున్నారు.


సరైనోడు సినిమాలో అల్లు అర్జున్, రకుల్ :


సో ఈ లెక్కన రకుల్ వరుసెంట మెగా హీరోలకే డేట్స్ ఇచ్చేస్తుంది అన్నది తెలుస్తుంది. ఇప్పుడే కాదు పరిశ్రమకు ఏ కొత్త హీరోయిన్ వచ్చినా మెగా హీరోల దాడి అంతేలా ఉంటుంది. ప్రస్తూం ఆ ఫ్యామిలీలో నుండి హీరోల సంఖ్య అధికంగా ఉన్న పరిస్థితుల్లో ఒక్కో హీరోతో ఒక సినిమా తీసినా సరే భారీ క్రేజ్ సంపాదించుకునే అవకాశం ఉంది. సో మొత్తానికి మెగా హీరోలకు రకుల్ లక్కీ హీరోయిన్ అయ్యిందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: