ఈసారి సమ్మర్ కు ఒక అచ్చ తెలుగు సినిమా రాబోతోంది అన్న సంకేతాలు నిన్న విడుదలయిన ‘అ ఆ’  టీజర్ ద్వారా తెలియ చేసాడు త్రివిక్రమ్. ‘అ ఆ’  టీజర్ ను చూసిన వారికి త్రివిక్రమ్ ఏదో ఒక దృశ్య కావ్యం చెక్కినట్లుగా అనిపించడం సహజం.

ఈ సినిమా  ట్రైలర్ ఓపెనింగ్  అంతా సమంతతోనే నిండిపోయిన నేపధ్యంలో ఇది ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అనే సంకేతాలు త్రివిక్రమ్ ఇచ్చాడు. ఇక ట్రైలర్ మధ్య పార్ట్ లో  హీరో నితిన్ చెల్లి చేత పవన్ ప్రస్తావన తో పంచ్ లు వేయించడం అందరికీ షాక్ ఇచ్చింది. ‘రావణాసురుడి మమ్మీ డాడీ కూడ సూర్పణకను సమంత అనే అనుకుంటారు’ అని రావు రమేష్ అంటే ‘రావాణాసురుడి భార్య కూడ వాళ్ళాయన్ను పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది' అంటూ చెల్లి క్యారెక్టర్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ చేత రిప్లయ్ ఇప్పించి తన ‘అ..ఆ’ లో పవన్ ప్రస్తావన ఉండేలా చేసుకున్నాడు త్రివిక్రమ్.  

 ఈ టీజర్ చూసిన వారికి నితిన్ సమంత లవ్ వ్యవహారంలో ఏదో ఒక ప్రాబ్లమ్ ఉందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. త్రివిక్రమ్ తాలూకు డైలాగుల పటుత్వం నటరాజ్ సుబ్రమణియన్ తీసిన విజువల్స్. మిక్కీ జె మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ లో అన్నీకలిపిన ఒక మంచి సినిమాను చూడబోతున్నాం అన్న సంకేతాలుకలుగుతాయి. కధను తన దైన స్టయిల్ లో చెప్పడంతో సిద్ధ హస్తుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసినిమాలో ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడో అనే ఆత్రుత ఈ ట్రైలర్ చూసిన వారికి కలుగు తుంది.

ఇక సమంత తన క్యూట్ లుక్స్ చూసిన వారి మనసులు దోచేసుకుంది. కేవలం అందంగా వుండడం కాదు రకరకాల ఫీలింగ్ లు చూపించి ఆకట్టుకుంది.  అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో రొటీన్ గా కనిపించే త్రివిక్రమ్ మార్క్ ఫన్ మిస్ అయిందా అనే అనుమానం ఈ ట్రైలర్ చూసిన వారికి కలుగుతుంది. ఏది ఏమైనా తెలుగు అక్షరాలూ మరిచిపోతున్న నేటి యూత్  కు తెలుగు అక్షరాలు ‘అ ఆ’ ను గుర్తు చేస్తూ త్రివిక్రమ్ ఒక మంచి సినిమా తీసాడు అనుకోవాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: