ఒక కొత్త హీరో ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలుపెట్టడం అన్నది ప్రపంచ సినీ చరిత్రలోనే ఒకే ఒక్కసారి జరిగింది. ఆ అరుదైన సంఘటన నందమూరి తారకరత్న విషయంలో జరిగింది. ఈ సంఘటనతో అప్పట్లో ఒక రికార్డు. ఈ సంఘటనతో తారకరత్న గిన్నిస్ బుక్‌ లోకి సైతం ఎక్కాడు. కానీ  ఆ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయి తారకరత్న ఫెయిల్యూర్ హీరో గా ముద్ర పడటంతో ఈ నందమూరి హీరోతో సినిమాలు తీసేవారే కరువు అయ్యారు. 

ఇక  లాభంలేదు అనుకుని విలన్ గా విలన్‌గా మారిన తారకరత్న తన అదృష్టాన్ని ‘రాజా చెయ్యి వేస్తే’ సినిమా ద్వారా పరీక్షించుకుంటే ఆ సినిమాలో అతడి విలన్ పాత్రకు పేరు వచ్చినా సక్సెస్స్ మాత్రం రాలేదు. ఈ సందర్భంలో ఈ మధ్య ఒక మీడియా  సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టాడు ఈ యంగ్ హీరో. 

\తన కెరియర్ తోలి రోజులలో ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలవడంతో తన ఆనందానికి అవధుల్లేవు అని అంటూ తొలి రోజు ఒక్కో సినిమా ప్రారంభోత్సవం కోసం బట్టలు మార్చడానికే సమయం అంతా అయిపోయింది. అయితే అలా ఒకేసారి అన్ని సినిమాలు మొదలయ్యేసరికి ఇక తాను సూపర్ స్టార్ అయిపోయినట్లే అనుకున్నానని తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు తారక రత్న. అయితే ఆ తరువాత తనకు వరస పరాజయాలతో వాస్తవం తెలిసింది అని కామెంట్స్ చేసాడు తారకరత్న. 

ఆ తరువాత తాను విపరీతమైన నిరాశతో కృంగిపోయినప్పుడు తన బాబాయ్ బాలకృష్ణ తనను దగ్గరకు తీసుకుని తనకు ధైర్యం చెప్పడమే కాకుండా తాను కెరియర్ లో సెటిల్ కావడానికి ఎంతగానో బాలకృష్ణ సహకరిస్తున్నాడు అంటూ తన కెరియర్ తొలి రోజు సంఘటనలను గుర్తుకు చేసుకున్నాడు తారకరత్న. కనీసం విలన్ గా అయినా రానున్న రోజులలో ఈ యంగ్ హీరో సక్సస్ అవుతాడో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: