పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చే పరిశ్రమ వ్యక్తులు మనకు తెలుసు. పవర్ స్టార్ ఒక అభిమానిగా హీరోల్లో ఎప్పుడు సందడి చేస్తుంటాడు నితిన్. తను చేసే ప్రతి పనిలోను పవన్ కళ్యాణ్ స్పూర్తి పొందే నితిన్ గురించి నిన్న జరిగిన అఆ ఆడియో వేడుకలో పవర్ స్టార్ గాలి తీసేశాడని తెలుస్తుంది.  


పవర్ స్టార్ ను అమితంగా ప్రేమించి అభిమానించే నితిన్ తనను ఇంతగా అభిమానిస్తున్నాడని పవన్ కు తెలియదని చెప్పడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. గుండెజారి గల్లతయ్యిందే సినిమాలో పవన్ సాంగ్ ను కూడా రీమిక్స్ చేసిన నితిన్ గురించి పవన్ మాట్లాడిన మాటలు కాస్త షాక్ అయ్యేలా చేశాయి. ఇక నితిన్ మాత్రం తన మొదటి సినిమా జయం దగ్గర నుండి తాను విజయం అందుకున్న ప్రతిసారి ప్రతి విషయంలో పవర్ స్టార్ ఇండైరెక్ట్ ఇన్వాల్వ్ మెంట్ ఉందని చెప్పేశాడు. 


అఆ ఆడియోలో నితిన్, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ :


నితిన్ చెప్పింది నిజమా కాదా అన్నది పక్కన పెడితే నితిన్ వీరాభిమానాన్ని చూసి అక్కడకు వచ్చిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఫిదా అయ్యారు. కాని నితిన్ తనకు ఇంత అభిమాని అని తనకు తెలియదని చెప్పిన పవన్ కాస్త కన్ ఫ్యూజ్ చేశాడు. త్రివిక్రం డైరెక్ట్ చేస్తున్న అఆ సినిమా నితిన్ కెరియర్ లో మంచి స్క్రీన్ అప్పియరెన్స్ అని చెప్పాలి. 


రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్ సినిమా మీద అంచనాలు ఏర్పడేలా చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెల చివరన రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. మరి పవన్ తన సినిమా ఆడియోకి వస్తే సినిమా హిట్టే అని నమ్ముతున్న నితిన్ సెంటిమెంట్ నిజమవుతుందా లేదా అన్నది తెలియాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: