ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ అంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరికీ ఇష్టం ఉంటుంది. ఆ ఫీల్ట్ అలాంటిది మరీ. అయితే కొంత మంది స్టార్ హీరోలు, ఇతర మేల్ సెలబ్రిటీలు ఎంత నిగ్రహించుకుని కూర్చున్నప్పటికీ…హీరోయిన్స్ మీద మీద పడుతుంటే వారు మాత్రం ఏం చేస్తారు. అందరిలాగే సర్ధుకుపోవాల్సిందే అని కొంత మంది చెప్పుకువస్తారు.  

అయితే ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫాంలో ఉన్న టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి హీరోయిన్స్ అంటే ఇష్టమేనా? అంటూ ప్రవేట్ ఛానలో స్పెషల్ స్టోరీ టెలికాస్ట్ అయింది. దీనికి సంబంధించిన వివరాలను చూస్తే…అందరిలాగే మాటల మాంత్రికుడు ఉంటాడు అని అనుకుంటే పొరపాటే అని అంటున్నారు. తనకు హీరోయిన్స్ పై ప్రత్యేకమైన అభిమానం ఉందని అంటున్నారు.

అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలోని గుసగుసలు ప్రకారం చూసుకుంటే, కొంత మంది టాప్ హీరోయిన్స్ మాత్రం త్రివిక్రమ్ అంటే తెగ ఇష్టపడతారంట. ముఖ్యంగా సమంత కి త్రివిక్రమ్ అంటే చాలా ఇష్టం అని అంటున్నారు. హీరోలతో కంటే డైరెక్టర్ త్రివిక్రమ్ తో సమంత కంఫర్ట్ గా ఉంటుందని చెబుతున్నారు. కానీ త్రివిక్రమ్ మాత్రం తన లిమిట్స్ లో తను ఉంటారు అని చెప్పుకొచ్చారు.

అలాగే జల్సా టైంలో స్పెషల్ సాంగ్ చేసిన పార్వతిమెల్టన్ సైతం త్రివిక్రమ్ కి పెద్ద అభిమాని. ఇప్పటికీ త్రివిక్రమ్ అంటే పార్వతి మెల్టన్ కి స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్పుకువచ్చారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్ అనేది ప్రతి సంవత్సరం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కానీ వాటికి దూరంగా ఉంటేనే కెరీర్ కాబట్టి…సాధ్యమైనంత వరకూ ఎటువంటి గ్లామర్ జోలికి వెళ్ళకుండా పని చేసుకుపోయే దర్శకులలో త్రివిక్రమ్ కూడ ఒకరు! అంటూ ఆ స్టోరీని ముగించేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: