మాన్లీ స్టార్ గోపిచంద్ శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లాడిన సంగతి తెలిసిందే.. శ్రీకాంత్, గోపిచంద్ కలిసి పనిచేయకపోయినా సరే గోపిచంద్ గురించి తెలుసుకుని శ్రీకాంత్ అక్క కూతురు రేష్మను గోపిచంద్ కు ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. వీరి వివాహం మే 12,2013లో జరిగింది. శ్రీకాంత్ పరిశ్రమలో మంచి హీరోగా స్థిరపడ్డాడు. ఇక గోపిచంద్ కూడా మంచి మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.


శ్రీకాంత్ స్వయానా మేనకోడలు అయిన రేష్మను శ్రీకాంత్ ఇష్టంతోనే గోపిచంద్ కు ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందట. గోపిచంద్, రేశ్మలకు ఓ బాబు కూడా ఉన్నాడు. తమ గారాల పట్టికి విరాట్ అని పేరు పెట్టారు గోపిచంద్ దంపతులు. పెళ్లికి ముందుదాకా రేష్మా అమెరికాలో ఎం.ఎస్ దాకా చేసి వచ్చారు. తొట్టేపూడి కృష్ణ రెండో కొడుకు అయిన గోపిచంద్ తొలివలపు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. 


అయితే ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో కొంతకాలం విలన్ పాత్రలు వేసి మరళ హీరోగా యజ్ఞంతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ వయసు 36 సంవత్సరాలు కాగా రేష్మది 28 దాకా ఉండొచ్చట. ఓ రకంగా గోపిచంద్ ది ప్రేమ వివాహం అని చెప్పొచ్చు. రేషం ఫోటో చూసి ఆమెతో సంబంధం మాట్లాడమని పెద్ద వాళ్లకు చెప్పాడట గోపిచంద్.


గోపిచంద్ పెళ్లికి ముఖ్య కారకుడు సీనియర్ నటుడు చలపతి రావు గారని సమాచారం. ఆయన ప్రోద్బలంతోనే శ్రీకాంత్ మేనకోడలు రేష్మ గోపిచంద్ తో వివాహం జరిగిందని టాక్. ఇక శ్రీకాంత్ కు కూడా గోపిచంద్ అంటే అపారమైన ప్రేమ. తనకంటే మంచోడనే నెపంతోనే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట శ్రీకాంత్. 



మరింత సమాచారం తెలుసుకోండి: