సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ గావు కేక పెట్టించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ తర్వాత కేక కాదు కదా కూత కూడా పెట్టించలేకపోయాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా ఎక్కకపోవడానికి అన్వేషిస్తే సినిమా స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అంతా త్వర త్వరగా చేసినట్టు అనిపిస్తుంది. అందుకే సినిమాలో క్లారిటీ మిస్ అయ్యారు. రెండు సంవత్సారాలు టైం తీసుకున్నా సర్దార్ కు సరిపోక అలా జరిగింది. అయితే ప్రస్తుతం మహేష్ నటిస్తున్న బ్రహ్మోత్సవంకు కూడా సేం స్టోరీ రిపీట్ అవుతుంది అని అంటున్నారు. 


ముందునుండి షూటింగ్ విషయంలో తర్జన భర్జన జరుగుతున్న బ్రహ్మోత్సవం మహేష్ కాస్త టెన్షన్ గా ఉన్నాడు. శ్రీమంతుడుతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ ఆ హిట్ మేనియాను కంటిన్యూ చేద్దామనుకుంటున్నాడు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుంది. కాని షూటింగ్ జరగాల్సిన టైంకు జరక్క పోవడంతో ఓ పక్క రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయలేని పరిస్థితి. అందుకే సినిమాను త్వరగా చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారట.


బ్రహ్మోత్సవంలో మహేష్ సమంత :


సో ఈ లెక్కలన్ని చూస్తుంటే సర్దార్ దారిలోనే బ్రహ్మోత్సవం కూడా నడుస్తుంది. అలా చూస్తే సర్దార్ కు తగిలిన దెబ్బే బ్రహ్మోత్సవంకు కూడా తగలక మానదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న బ్రహ్మోత్సవం సినిమా ఆడియో ఈ నెల 7న అంగరంగ వైభవంగా జరుగనుంది.


మరి మహేష్ సర్దార్ బాటలో నడుస్తున్నాడా లేదా అన్నది పక్కన పెడితే సర్దార్ రిజల్ట్ కన్నా మంచి రిజల్ట్ తెచ్చుకుంటాడా లేదా అన్నది ప్రస్తుతం ఉన్న సందేహం. ఓ పక్క త్రివిక్రం అ ఆ అంటూ తన మార్క్ స్టైల్ తో మహేష్ మీద ఎటాక్ చేసేందుకు ఈ నెల 27న రాబోతున్నాడు. మరి సమ్మర్ సూపర్ సినిమాగా బ్రహ్మోత్సవం ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: