పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించడానికి అవకాశం వస్తే చాలు అని టాప్ హీరోయిన్స్ అంతా కలలు కంటూ ఉంటే ఒక బాలీవుడ్ హీరోయిన్ మాత్రం పవన్ తో నటించడం టార్చర్ అని అంటోంది. ‘బంగారం’ సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన మీరా చోప్రా ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈసంచలన వ్యాఖ్యలు చేసింది.

టాప్ హీరోలు ఎంతమంది  ఉన్నా పవన్ తో పని చేయడం చాలా కష్టం అని చెపుతోంది మీరా చోప్రా. దీనికి  కారణం కూడా  వివరంగానే చెప్పింది. పవన్ తో ‘బంగారం’ మూవీ చేసేటపుడు తనకు ఎదురైన అనుభవాల కారణంగానే ఈ అభిప్రాయానికి వచ్చినట్లు చెపుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ. పవన్ కళ్యాణ్ తో పని చేయడం చాలా కష్టం అక్కడ ఖచ్చితంగా తొక్కిసలాట జరుగుతుంది అని అంటూ  తమిళనాడులో పొలాచ్చిలో జరిగిన ఘటనను వివరించింది.

‘బంగారం’  మూవీ షూటింగ్ తమిళనాడులోని పొలాచ్చిలో జరుగుతున్నప్పుడు  అక్కడ హోటల్స్ ఉండక పోవడంతో  తాము అంతా ఒక  చిన్న గెస్ట్ హౌజ్ లోనే ఉన్నవిషయాన్ని గుర్తుకు చేసుకుంది. అయితే అప్పుడు అక్కడికి పవన్ వచ్చాడని తెలిసి చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చేశారట.  దాదాపు 10వేల మంది గెస్ట్ హౌజ్ చుట్టూ మూగి పోవడం తో 2 రోజుల పాటుషూటింగ్  చేసే  విషయంలో జనం మధ్య పడ్డ టార్చర్ ను గుర్తుకు చేసుకుంది మీరా చోప్రా. 

తానూ న్యూయార్క్ లో పెరిగిన నేపధ్యాన్ని చెపుతూ ఇండియాలో స్టార్ హీరోలను దేవుళ్లుగా కొలుస్తారని తెలుసు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో దీన్ని ప్రత్యక్షంగా చూశానుఅంటూ పవన్ ని ఆకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ  1920 లండన్ అనే హిందీ హారర్ మూవీ చేస్తూ ఇంత హఠాత్ గా పవన్ ను గుర్తుకు చేసుకోవడం చూస్తే పవన్ కొత్త సినిమాలో హీరోయిన్ గా అవకాశం కోసం ఈమె కూడ ట్రై చేస్తోంది అని అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: