బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ షూటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారభం అవుతున్నా బాలయ్యకు హీరోయిన్ కష్టాలు వదలటం లేదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే నయనతార కాజల్ లాంటి హీరోయిన్స్ బాలయ్య 100వ సినిమా హీరోయిన్ ఛాన్స్ రకరకాల కారణాలతో మిస్ అయిన నేపధ్యంలో ఇప్పుడు బాలయ్యకు లేటెస్ట్ గా ఇలియానా షాక్ తగిలినట్లు ఫిలింనగర్ లో వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈమధ్య క్రిష్ ఇలియనాను కలిసి ఈ సినిమాలో పోషించవలసిన పాత్ర గురించి వివరించినప్పుడు మొదట్లో ఉత్సాహం చూపించిన ఇలియానా తన పాత్ర పూర్తి స్వరూపం విన్న తరువాత ఆ పాత్రకు తాను సరిపోను అని కామెంట్ చేసినట్లు టాక్. దీనికి కారణం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో కొన్ని సన్నివేసాలలో వయసు పైబడిన రాణిగా కనిపించాలని క్రిష్ చెప్పడంతో అ మాటలకు ఇలియానా అదిరిపోయింది అని టాక్. 

దీనితో క్రిష్ ముంబాయిలోని తనకు ఉన్న పరిచయాలు రీత్యా మరో హీరోయిన్ వేటలో ఉన్నాడని టాక్. లేటెస్ట్ గా తెలుస్తున్న సమాచారం మేరకు బాలకృష్ణ పక్కన రాణిగా నటించడానికి విద్యాబాలన్ ఉత్సాహం చూపెడుతున్నా ఇప్పటికే హేమమాలిని ఈసినిమాలో రాజమాతగా నటిస్తున్న నేపధ్యంలో అందరూ బాలీవుడ్ హీరోయిన్స్ అయితే తెలుగు ప్రేక్షకులు దానిని అంగీకరించకపోవచ్చు అన్నఅనుమానాలు కూడ క్రిష్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ పరిస్థుతుల నేపధ్యంలో హీరోయిన్ ఎంపిక పూర్తి కాకుండానే మొరాకోలో జరగబోయే భారీ యుద్ధ సన్నివేశాల షూటింగ్ ను పూర్తి చేసి ఆ తరువాత హీరోయిన్ ఎంపిక గురించి ఆలోచించాలి అనే యాక్షన్ ప్లాన్ లో క్రిష్ ఉన్నట్లు టాక్. దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈభారీ సినిమాకు హీరోయిన్ కష్టాలు ఏర్పడటం షాకింగ్ న్యూస్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: