చిరంజీవి పాటలను రీమిక్స్ చేసి వరస విజయాలను కొట్టేస్తున్న సాయి ధరమ్ తేజ్ రేపు రాబోతున్న తన ‘సుప్రీమ్’ కోసం పవన్ కళ్యాణ్ పై కూడ గురి పెట్టాడు. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదల చేసిన స్టైల్స్ లో పవన్ ‘గబ్బర్ సింగ్’ అవతారాన్ని ఇమిటేట్ చేస్తూ కనిపిస్తున్న స్టైల్ ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

ఇప్పటి వరకు ఏ మెగాయంగ్ హీరో అనుసరించని విధంగా సాయి ధరమ్ తేజ్ తన చిన్న మామయ్యా పవన్ లుక్ ను యధాతధంగా దింపేసి అటు చిరంజీవి ఇటు పవన్ అభిమానుల ప్రశంసలు పొందడానికి మెగా స్కెచ్ వేసాడు. రేపు విడుదల కాబోతున్న ఈసినిమా ఏకంగా కోలీవుడ్ టాప్ హీరో సూర్య నటించిన ‘24’ ను టార్గెట్ చేస్తూ విడుదల అవుతున్న నేపధ్యంలో సాయి ధరమ్ తేజ్ సాహసానికి అందరూ అదిరిపోతున్నారు.

కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సూర్య ‘24’ సినిమా కథ సామాన్య ప్రేక్షకులకు నచ్చదు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘24’ మూవీ ఫెయిల్ అయి ‘సుప్రీమ్’ సక్సస్ అయితే ఇక సాయి ధరమ్ తేజ్ ఆనందానికి హద్దులు ఉండవు. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఇప్పటికే ప్రీ పాజిటివ్ టాక్ లో ఉన్న ‘సుప్రీమ్’ సక్సస్ అయి 25 కోట్ల కలక్షన్స్ ను రాబట్టకోగలిగితే ఇక సాయి ధరమ్ తేజ్ కు యంగ్ హీరోలలో ఎదురుండదు అన్న వార్తలు వస్తున్నాయి.

‘పటాస్’ సినిమాతో హిట్ దర్శకుడుగా పేరు పొందిన అనీల్ రావిపూడి అదృష్టం నిర్మాత దిల్ రాజ్ వ్యూహాత్మక ఎత్తుగడలు ఫలించి రేపు విడుదల కాబోతున్న ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తే చాలు ఇక ఈ మెగా యంగ్ హీరోకు ఎదురుండదు. దీనికితోడు రాశి ఖన్నా గ్లామర్ కూడ సాయి ధరమ్ తేజ్ కు కలిసి వస్తుంది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: