టాలీవుడ్ హీరోలలో ప్రభాస్ జూనియర్ ల తరువాత రాజమౌళికి అత్యంత ఆప్తుడైన వ్యక్తిగా హీరో నానీని గుర్తిస్తూ  ఉంటారు. ‘ఈగ’ సినిమాలో నాని పాత్ర అతి చిన్నది అయినా నాని కెరియర్ కు టర్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరోసారి రాజమౌళి నాని గురించి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ‘బాహుబలి 2’ షూటింగ్ లో బిజీగా ఉంటూ కూడ రాజమౌళి నానీకి ఈ సహాయం చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న ‘జెంటిల్ మెన్’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ‘ఉయ్యాల జంపాల’ సినిమా దర్శకుడు విరించి వర్మ దర్శకత్వంలో ఒక సినిమాను వెంటనే చేయబోతున్నాడు. అయితే ఈసినిమాలో నాని చేస్తున్న పాత్ర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అని తెలుస్తోంది. సహజత్వం కోసం నాని దర్శకుడు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నట్లు కొన్ని సీన్స్ తీస్తారట. 

ఈసన్ని వేసాలలో వెండి తెర పై రాజమౌళి దర్శకుడుగా నటిoచబోతున్నట్లు టాక్. ‘బాహుబలి 2’ షూటింగ్ లో బిజీగా ఉంటూ కూడ నాని కోసం ఈ అతిథి పాత్రను చేయడానికి  రాజమౌళి అంగీకరించినట్లు తెలుస్తోంది. హీరో కాక ముందు నిజ జీవితంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని తిరిగి వరించి వర్మ దర్శకత్వంలో అదే పాత్రను పోషించడం ఈ సినిమాలోని ట్విస్ట్.

సినిమా రంగంలో ఒక డైరెక్టర్ గా మారుదామని ప్రయత్నించే ఒక యువకుడి జీవితం చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామాగా ఈసినిమా ఉండబోతుందని టాక్. మరి రాజమౌళి ప్రత్యేక పాత్ర  నానీకి ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: