కొద్దిరోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన ట్విటర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయమై విన్నపాలతో కూడిన విజ్ఞప్తులు చేయడంతో పవన్ మళ్ళీ జనంలోకి రాబోతున్నాడు అంటూ రకరకాల ఊహలతో కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ విషయాలు ఏమి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో విదేశీయానం వెళ్ళుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

పవన్ ఇటువంటి విదేశీ విహార యాత్రలను చేసేడప్పుడు చాల రహస్యంగా వెళ్ళి వస్తూ ఉంటాడు. పవన్ ఏ దేశానికి వెళ్ళాడు అక్కడ ఎన్ని రోజులు ఉంటాడు అన్న విషయం పవన్ సన్నిహితులకు కూడ తెలియకుండా ఉంటాడని చాలామంది అతని సన్నిహితులే చెపుతూ ఉంటారు. ఈసారి కూడ అదే స్టోరీ రిపీట్ అవుతున్నట్లు టాక్.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ షాక్ తరువాత పవన్ ఎస్.జె. సూర్య దర్శకత్వంలో సినిమాను ప్రారంభించినా ఈసినిమా షూటింగ్ జూన్ వరకు ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించక పోవడంతో పవన్ ఇలా తన భార్యతో లాంగ్ వెకేషన్ వెళుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను బట్టి సినిమాలకే కాకుండా రాజకీయాలకు కూడ తాత్కాలికంగా పవన్ సెలవులు ప్రకటించినట్లే అనుకోవాలి.

ఈ వార్తలు ఇలా ఉండగా ఎస్.జె. సూర్య డైరెక్షన్ లో నిర్మించబోయే సినిమాకు హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీకన్నా సెంటిమెంట్ రీత్యా దక్షిణాది బ్యూటీ ముఖ్యంగా మలయాళీ బ్యూటీ కలిసి వస్తుంది అనే నమ్మకంతో ఎస్.జె. సూర్య పవన్ కు అన్ని విధాల సరిపోయే ఒక మలయాళీ బ్యూటీని హీరొయిన్ గా ఎంపిక చేసే విషయంలో బిజీగా ఉన్నాడని టాక్. పవన్ విదేశీయానంతో కొన్ని రోజులపాటు పవన్ పై వార్తలకు కూడ సమ్మర్ హాలిడేస్ అని భావించాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: