రోజు రోజుకి పెరుగుతున్న తెలుగు సినిమా స్టామినా కలక్షన్స్ స్టామినా ఆశ్చర్య పరుస్తుంది. స్టార్ హీరో సినిమాలైతే కంటెంట్ ఉంటే చాలు కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇక లెక్కకు మించిన వసూళ్లను రాబట్టడం తెలుగు పరిశ్రమకు కొత్తేమి కాదు.. అయితే ఈ ఫార్ములాను సరైన రీతిలో పాటించే హీరోలు తక్కువగా ఉన్నారు. సినిమా సినిమాకు తమ కలక్షన్స్ స్టామినా పెంచుకుంటూ పోవాలని చూస్తున్న హీరోలకు అన్ని మంచి తరుణాలే కనిపిస్తున్నాయి. 


సర్దార్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ :


అయితే స్టార్ హిరోలు సినిమా కథల విషయంలో ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని సిని పండితుల అభిప్రాయం. స్టార్ హీరోల సినిమాలు ఎలా ఉన్నా మొదటి వారం కలక్షన్స్ అదిరిపోతాయి. అయితే అదే ఫాంతో మంచి కథలను తెరకెక్కించే ప్రయత్నం చేస్తే ఇక సీన్ సితారే అవుతుంది. తెర మీద తమ అభిమాన నటుడు ఊహించని మలుపులతో సినిమా తీస్తే దాన్ని సూపర్ హిట్ చేసే బాధ్యత మాది అంటారు అభిమానులు.


బాహుబలిలో ప్రభాస్ :


ప్రస్తుతం స్టార్ హీరోలే కాదు చిన్న హీరోలు కూడా బాక్సాఫీస్ మీద యుద్ధానికి సై అంటున్నారు. వారికి థియేటర్స్ తక్కువ వస్తున్నా సరే ఉన్నంతలో మంచి వసూళ్లను రాబట్టి పరిశ్రమకు మంచి చేకూరుస్తున్నారు. మరి ఈ సంచలనాల సునామి ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు కాని స్టార్ హీరో సినిమా అంటే రికార్డ్ బద్ధలవ్వాల్సిందే అన్న పరిణామాలు పరిశ్రమకు పూల బాట వేస్తున్నాయని చెప్పాలి.


సరైనోడులో అల్లు అర్జున్ : 


ప్రస్తుతం రానున్న సినిమాలతో కూడా తెలుగు ప్రేక్షకులను తమ సినిమాలతో అలరించేందుకు వస్తున్నారు స్టార్ హీరోలు. ప్రతి వారాంతరం లెక్కలేనన్ని సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే తమ పని అని దర్శక నిర్మాతలు పూనుకున్నారు. మరి పరిశ్రమలో వచ్చిన ఈ మార్పు కొంతకాలం ఇలానే కొనసాగి ఇంకా మరెన్నో రికార్డులు తెలుగు సినిమా పరిశ్రమ సొంతం కావాలని ఆశిద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: