దేశంలో ఆడవాళ్ల మీద జరుగుతున్న అత్యాచారాల గురించి ప్రముఖ హీరోయిన్ ప్రియమణి స్పందించడం జరిగింది. దేశంలో అమ్మాయిలపై జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ ఆమె ట్వీట్స్ చేయడం విశేషం. అయితే ప్రియమణి ట్వీట్స్ కు నెటిజెన్ల ఆగ్రహానికి గురయ్యారు. తాను దేశ వ్యతిరేకిని కాదు కాని అమ్మాయిలకు జరుగుతున్న దాని గురించి అలా స్పందించాననని అంటుంది. 


మొన్నామధ్య బెంగుళూరులో అందరు చూస్తుండగానే ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు.. కేరళలో బిషా అనే మహిళను కూడా దారుణంగా అత్యాచారం జరిపిన సంఘటన తెలిసిందే. అయితే ఈ రెండు సంఘటనల పట్ల ప్రియమణి దేశంలో ఆడవాళ్లకు రక్షణ లేదు కావున అమ్మాయిలు దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం మంచిది అని ట్వీట్ చేసింది.

భారతదేశం మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతుందని ఆమె అభిప్రాయపడ్డాడు. ఇక దేశంలోని అమ్మాయిలందరు భద్ద్రత గల దేశానికి వెళ్లాలని సూచించింది. అయితే ప్రియమణి చేసిన ఈ ట్వీట్స్ కు నెటిజెన్ల నుండి విమర్శలు వస్తునాయి.    


తాను చేసిన ట్వీట్స్ దేశ వ్యతిరేకతకు కాదని.. కేవలం దేశంలో మహిళలకు భద్రత లేదని చెప్పేందుకే అని వివరణ ఇచ్చింది. అయితే దేశానికి సంబందించిన ఓ సెన్సిటివ్ మ్యాటర్ లో వేలు పెట్టిన ప్రియమణి ప్రభుత్వం నుండి కూడా తప్పకుండా అక్షింతలు వేస్తుందని అభిప్రాయపడుతున్నారు కొందరు. 



మరింత సమాచారం తెలుసుకోండి: