న్న దర్శక రత్న దాసరి నారాయణరావు పుట్టినరోజునాడు టాలీవుడ్ కు చెందిన అనేకమంది ప్రముఖులు ఆయనను వ్యక్తిగతంగా కలిసి అభినందించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా  పవన్ కళ్యాణ్ దాసరి నారాయణరావు ఇంటికి వెళ్ళి ఆయనను అభినందించడమే కాకుండా సుమారు ఒక పావుగంట సేపు దాసరితో గడపడం ఇప్పుడు టాలీవుడ్ కు సంచలన వార్తగా మారింది. 

అంతేకాదు పవన్ తో దర్శకుడు త్రివిక్రమ్ కూడ దాసరి ఇంటికి వెళ్ళి అభినందించినట్లు వార్తలు రావడంతో పవన్ దాసరిల సినిమాకు త్రివిక్రమ్ కథ అందించడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. నిన్న తన పుట్టినరోజు సందర్భంగా దాసరి అనేక పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడ పవన్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోంది అంటూ లీక్ లు ఇచ్చిన రోజునే పవన్ దాసరి ఇంటికి వెళ్ళడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.   

అయితే మరో షాకింగ్ న్యూస్ కూడ నిన్న ప్రచారంలోకి వచ్చింది. పవన్ తో దాసరి తీయబోయే సినిమాకు ‘గబ్బర్ సింగ్’ దర్శకుడు హరీష్ శంకర్ కు మరోసారి అవకాశం ఇచ్చే ఆలోచనలో పవన్ ఉన్నాడని దానికి దాసరి కూడ ఎటువంటి అభ్యంతరాలు చెప్పడం లేదని టాక్. అయితే పవన్ తో సినిమాను దాసరి నిర్మించాలి అంటే కనీసం 25 కోట్ల పెట్టుబడి కావలసిన పరిస్థుతులలో ఇప్పడు దాసరి ఉన్న పరిస్థుతులలో అంత పెట్టుబడి ఆయన ఎక్కడ నుంచి పెడతారు అన్న కామెంట్స్ మరి కొందరు చేస్తున్నారు. 

అయితే చిరంజీవి 150వ సినిమా లాంచ్ రోజున అక్కడకు వెళ్ళి 5 నిమిషాలు కనిపించడానికి తీరికలేని పవన్ ఈరోజు ప్రత్యేకంగా వీలుచేసుకుని ఇలా దాసరి ఇంటికివెళ్ళడం వెనుక ఇంకా ఏమైనా వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయా ? అన్న విషయమై రకరకాల గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఏమైనా దాసరి పుట్టినరోజునాడు చిరంజీవికి పవన్ అనుకోని షాక్ ఇచ్చాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: