పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమి చేసినా అది మీడియాకు హాట్ టాపిక్ గా మారడం సహజం. ఆ మధ్య పవన్ పెంచుకున్న గుబురు గడ్డం నుండి మొన్న నితిన్ ‘అ ఆ’ ఆడియో ఫంక్షన్ కు పెట్టుకు వచ్చిన వాచీ వరకు ఏదో ఒక విమర్శల దాడి పవన్ పై కొనసాగుతూనే ఉంది. 

ఆ మధ్య ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రిలీజ్  టైంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వద్ద డబ్బులు లేవని అందువల్ల తన స్టాఫ్ కు కూడ జీతాలు ఇవ్వడం కష్టంగా ఉంది  అని చెప్పిన  పవన్ మాటలకు చేస్తున్న పనులకు ఏమాత్రం పొంతన లేదంటు వెబ్ మీడియాలో దాడి మొదలైంది. దీనికి కారణం రీసెంట్‌గా జరిగిన  నితిన్ ‘అ ఆ’ మూవీ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన పవన్‌ కల్యాణ్ ను అన్ని విధాలా స్కాన్ చేసిన మీడియా చివరకు పవన్ చేతికున్న వాచ్‌ పై తదేకంగా ఫోకస్ పెట్టింది. 

ఈ వాచ్ ని చూసిన నెటిజెన్ లు ఈ వాచ్ ధర అక్షరాలా 3 లక్షల 82 వేలుగా  తేల్చి పవన్ పై సెటైర్లు వేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.  అంతేకాదు ప్రపంచంలోని ఖరీదైన వాచ్‌ లలో ఇదీ కూడా ఒకటిని అంటు ఘాటైన విమర్శలు చేస్తున్నారు.  అయితే పవన్ వీరాభిమానులు మాత్రం  సెలబ్రిటీ అన్నాక ఆ మాత్రం సహజమని అంటూ ఈ విమర్శలను తిప్పి కొడుతున్నారు.  

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ తన అత్తారింటికి తన కూతురు భార్య అన్నాతో కలిసి పవన్ ఆస్ట్రేలియా ఫ్లైటెక్కుతున్నాడు అని టాక్. మూడు వారాలపాటు పవన్ ఫ్యామిలీతో ఆస్ట్రేలియాలో గడుపుతాడని టాక్. ఈ విషయం పవన్ విమర్శకుల దృష్టి వరకు వెళ్ళడంతో అప్పుడప్పుడూ ట్విట్టర్‌ లో పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల గురించి మాట్లాడుతు పార్ట్ టైం రాజకీయ వేత్తగా మాత్రమే సరిపోతాడు కాని సీరియస్ రాజకీయాలకు పనికి రాడు అని ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: