తెలుగు చలన చిత్ర రంగంలో పెను సంచలనాలకు నాంది పలికిన చిత్రం ‘బాహుబలి’. రాజమౌళి రెండు సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి తెరకెక్కించిన చిత్రం ఫ్యూజువల్ వండర్స్ తో ప్రపంచ వ్యాప్తంగా అందరిని మంత్ర ముగ్ధులను చేసిన చిత్రం బాహుబలి. ఈ చిత్రంతో అప్పటి వరకు నామమాత్రంగా ఉన్న తెలుగు ఇండస్ట్రీ పేరు ఒక్కసారిగా భారత దేశంలో మొత్తం ఔరా అనిపించేలా చేసింది. ఈ చిత్రంతో నటీనటులకు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. అంతే కాదు జాతీయ ఉత్తమ చిత్రంగా బాహుబలి అవార్డు గెలుచుకుంది. అయితే ఈ చిత్రంపై పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద సంచలనం అయ్యింది.

మగధీర చిత్రం పోస్టర్

బాహుబలి చిత్రం కంటే మగధీర చిత్రం చాలా బాగుందనీ ఆ సమయంలో బాహుబలి చిత్రానికి చేసినంత ప్రచారం చేసి ఉంటే సోషల్ మాద్యమాల ద్వారా పాపులారిటీ వచ్చి ఉంటే.. హిందీలో కూడా రిలీజ్ చేసి ఉంటే అంతకుమించిన పెద్ద హిట్ అయ్యేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వాస్తవానికి ఈ చిత్రం కూడా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం రాంచరణ్ కి రెండవ చిత్రం కావడం అప్పట్లో ఉమ్మాడి రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ తుడిచిపెట్టింది.  అయితే ఆ చిత్రానికి ఇంతగా ప్రచారం జరుగలేదు పైగా హిందీలో కూడా రిలీజ్ కాలేదు ఒకవేళ అయ్యుంటే బాహుబలి ని మించి వసూళ్ళ ని రాబట్టి ఉండేదని అన్నాడు పవర్ స్టార్ .  

బాహుబలి పోస్టర్


అంతే కాదు మన సినిమాలకు మార్కెట్ కూడా పెద్దగా లేదని అదే తమిళ సినిమాలు మాత్రం మన దగ్గర మంచి వసూళ్ళ ని సాధిస్తున్నాయని అవేదన వ్యక్తం చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. ఇక తమిళ సినిమాలు మన దగ్గరు భారీ స్థాయిలో విడుదల అవుతున్నాయని మరి మన సినిమాలు అక్కడ రిలీజ్ కావడమే కష్టంగా మారిందనీ ఒకవేళ రిలీజ్ అయినా అక్కడ అంతగా ప్రభావం చూపించడం లేదు . 


మరింత సమాచారం తెలుసుకోండి: